AP CM YS Jagan| ( File Photo)

Amaravati, Mar 05: విశాఖపట్నంను ( Visakhapatnam) పరిపాలన రాజధానిగా నిర్ణయించాక ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (Amaravati Metro Rail Corporation) ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ జగన్ సర్కారు (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఏపీ బాటలో ఉత్తరాఖండ్, అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం రావత్

విశాఖలో 79.91 కిలోమీటర్లు మేర లైట్ మెట్రోరైలు కారిడార్ ను 60 కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది. డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్లు పిలిచింది.

ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు (Metro Rail project) పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి.

ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ

రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు గత మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే పూర్తిగా కట్టుబడ్డ వైసీపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది.

కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం, పార్టీ పట్టించుకోలేదంటూ ఆవేదన

జ్యుడీషియల్ రాజధాని కర్నూలుకు పలు విభాగాలను ఇప్పటికే తరలించిన ప్రభుత్వం.. పరిపాలనా రాజధాని విశాఖకు సైతం పలు పలు విభాగాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయించింది.