AP Local Body Elections 2020 cm-ys-jagan-comments-review-spandana-program (Photo- CMO APTwitter)

Amaravati, March 4: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఏం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయాలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన సీఎం జగన్

ఇందులో భాగంగా ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై, పెన్షన్ల డోర్‌ డెలివరీపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్లను వేగంగా అభివృద్ధి చేసి, పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు.

దీంతో పాటుగా ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మన కలను నిజం చేసే దిశగా అందరూ శరవేగంగా పని చేయాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఇళ్ల స్థలాలే ఇవ్వాలని సూచించారు.

మోదీ ప్రభుత్వానికి సున్నితంగా ఎదురెళుతున్న ఏపీ సీఎం

ఈ నెల 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించారు. వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్‌ కరెక్టుగా జరగాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలను (Andhra local body elections) పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. ఎన్నికల తేదీలు, ఇతర అంశాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అధికారులు సమావేశమవుతారని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ (Andhra Pradesh Local Body Polls 2020) ఖరారవుతుందని చెప్పారు.

స్పందన కార్యక్రమంపై మంగళవారమిక్కడ సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలు శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎన్నికల నిర్వహణ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు

హైకోర్టు ( High Court) కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో (14th Finance Commission) ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

‘పంచాయతీ రాజ్‌ చట్టంలో సవరణలు చేస్తూ విప్లవాత్మక మార్పుల కోసం ఆర్డినెన్స్‌ తెచ్చాం. అవినీతిని నిర్మూలించడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని ఎన్నికల వ్యవస్థ నుంచి పూర్తిగా, శాశ్వతంగా తీసేయాలనే దృఢ సంకల్పంతోనే ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం. ఈ ఆర్డినెన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి పోలీసు అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా, బాధ్యులపై అనర్హత వేటు పడుతుంది.

మూడేళ్ల పాటు జైలుకు పంపుతాం. ఎక్కడా కూడా డబ్బులు, మద్యం పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనేది చాలా ప్రాధాన్యమైన అంశం. ఒక్క గ్రామంలో కూడా డబ్బులు, మద్యం పంపిణీ చేసి.. ఎన్నికలు నిర్వహించారనే మాట వినిపించ కూడదు. ఈ రెండు అంశాలపై పోలీసు యంత్రాంగం చాలా దృఢంగా పని చేయాలి. దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని తెలిపారు.

ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి, వారికి సేవ చేసే మంచి వ్యక్తులు గెలిచే అవకాశం సృష్టించడానికే పంచాయితీ రాజ్ చట్టంలో సవరణల ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చాం. ఈ మార్పులు కనిపించే విధంగా ఎస్పీలందరూ పని చేయాలి. డబ్బులు, మద్యాన్ని అరికట్టడంలో ఎస్పీలు కీలకంగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.