Uttarakhand govt makes big announcement; Gairsain to be hill state's summer capital (Photo-facebook and instagram)

Dehradun, Mar 05: ఆంధ్రప్రదేశ్ బాటలో ఇప్పుడు మరో రాష్ట్రం కూడా నడుస్తోంది. ఉత్తరాఖండ్‌కు ఇకపై మూడు రాజధానులు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్, బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనిటాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో ముందుకు దూసుకుపోనుంది.

రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీలో మరింత వివరణ ఇచ్చిన త్రివేంద్ర సింగ్ రావత్, పర్వత ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గైర్సైన్ ను క్యాపిటల్ చేయాలని తాను కూడా పోరాడానని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చే సమయం ఆసన్నమైందని, ఇకపై వేసవిలో తాను అక్కడే మకాం వేసి, పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది

గైర్సైన్‌ను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం కూడా గైర్సైన్‌ రాజధానిగా ఉండాలని పోరాడారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి

గైర్సైన్‌ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రకటన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రజల మనోభాభావాలకు గౌరవం ఇచ్చే సమయం ఆసన్నమైందని ఇకపై వేసవిలో తాను అక్కడే మకాం వేసి పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కర్నూలు న్యాయపరమైన రాజధానిగా, వైజాగ్ పరిపాలన రాజధానిగా, అమరావతి చట్టసభల రాజధానిగా ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.