Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 7,943 మందికి కరోనా, 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్, కొత్తగా 98 మంది మృత్యువాత, ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7,943 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కు చేరింది.
Amaravati, May 31: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7,943 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాత పడగా మొత్తం మరణాల సంఖ్య 10,930కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 28 వేల 360 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 1,92,56,304 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,92,56,304 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 231, విజయనగరం- 271, విశాఖ- 551, తూ.గో- 1877, ప.గో- 461, కృష్ణా- 291, గుంటూరు- 765, ప్రకాశం- 345, నెల్లూరు- 378, చిత్తూరు- 1283, అనంతపురం- 544, కర్నూలు- 499, వైఎస్ఆర్ జిల్లా- 447 కేసులు నమోదయ్యాయి.
Here's AP Covid Report
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా, నిల్వలపైన సోమవారం సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.అర్బన్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 2632.. రూరల్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు కేసులు 1859 ఉన్నాయని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, మే 16న పాజిటివిట్ రేటు 25.56 శాతం ఉండగా, మే 30 నాటికి 15.91 శాతంగా నమోదైందని వెల్లడించారు.
అలాగే 2 లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటుకూడా గణనీయంగా మెరుగుపడిందని, మే 7న 84.32శాతంగా ఉన్న రికవరీ రేటు, ప్రస్తుతం దాదాపు 90శాతానికి చేరిందని వెల్లడించారు. మే 3న 19,175 కాల్స్ 104కు రాగా, మే 29న 3,803 కాల్స్ నమోదయ్యాయని, కేసుల సంఖ్య తగ్గిందనడానికి ఇదొక సంకేతమని అన్నారు. అన్ని జిల్లాల్లో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌రాకపోయినా బ్లాక్ ఫంగస్ వచ్చిందన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 29న 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించగా.. వినియోగం ఆస్థాయికి వచ్చేంతవరకూ కూడా అధికారులు ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వచేసే ట్యాంకులు ఉండాలని సీఎం ఆదేశించారు.
సరైన పథకాల్లో పిల్లల డబ్బు మదుపు చేయడం ద్వారా భద్రత, నెలనెలా వారి మెయింటినెన్స్ కోసం మంచి వడ్డీ వచ్చేలా చూడాలని.. చదువులకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని.. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని.. వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)