COVID Curfew Extended in AP: ఏపీలో జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష
Andhra Pradesh Partial curfew (Photo: PTI)

Amaravati, May 31: కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ (COVID Curfew Extended in AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా (xtended till June 10 with same set of restrictions) కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్‌ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్‌ 10 వరకు కర్ఫ్యూను (Corona curfew in Andhra Pradesh) పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Here's Update News

ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగనుంది. కాగా కొవిడ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈనెల 5న ప‌గ‌టి కర్ఫ్యూని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వ‌ర‌కూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది.

ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పేషెంట్ల బంధువులు మాత్రమే కృష్ణపట్నం రావాలని సూచన, మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశాలు

ఆ త‌ర్వాత కూడా క‌రోనా కేసుల్లో త‌గ్గుద‌ల న‌మోదు కాక‌పోవ‌డంతో ఈ నెలాఖ‌రుకు వ‌ర‌కూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గ‌డువు ఇవాళ్టితో ముగియ‌డంతో స‌మీక్ష నిర్ణ‌యించిన సీఎం జూన్ 10 వ‌ర‌కూ క‌ర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా.. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.