Amaravati, May 31: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను (School Summer Holidays) జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది. ఈ ప్రకటన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 తర్వాత పరిస్థితిని సమీక్షించి స్కూళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3తో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను (Summer vacation) పొడిగించింది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో (Covid-19 second wave) ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో వాయిదా వేశారు.
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించనేలేదు. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.