West Godavari Shocker: తన లవర్ వేరే బైక్ ఎక్కిందని ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన, చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు

శ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని అయిన సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

West godavari, Sep 18: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని అయిన సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న అర్ధరాత్రి సురేశ్‌ తన పాల బూత్‌లో పని చేస్తున్న యువతిని బైక్‌పై ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టాడు. తాను ప్రేమిస్తున్న యువతిని సురేశ్‌ బైకుపై ఎక్కించుకున్నాడనే కోపంతో ఓ యువకుడు అతడిపై కత్తితో దాడి (Man attacks a Person with knife) చేశాడు.

ఈ ఘటనలో సురేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్‌ మృతిచెందారు. ఘటన అనంతరం దాడి చేసిన యువకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రి నేను రూంలోకి వెళితే..నా భర్త బయటకు పరిగెత్తుతున్నాడు, ఆ విషయం గురించి అడిగితే కోపంతో చితకబాదుతున్నాడు, భర్తతో పాటు అత్త మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడిని.. దిశ యాప్‌ ద్వారా సమచారం అందుకున్న పోలీసులు మూడు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కాణిపాకం మండలంలో జరిగింది. కాణిపాకం ఎస్‌ఐ రమేష్‌బాబు కథన మేరకు.. మండలంలోని చిగరపల్లె దళితవాడలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటిముందు వీధిలో ఆడుకుంటున్న బాలిక (9)కు అదే ప్రాంతానికి చెందిన కేశవులు (55) మాయమాటలు చెప్పి పక్కనున్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు.

వీడు మనిషేనా..అవ్వ అందుకు ఒప్పుకోలేదని చంపేసి ఆ శవంతో సెక్ప్ చేశాడు, తాగిన మత్తులో వృద్ధురాలిని చంపి ఆ బాడీతో కామవాంఛను తీర్చుకున్న 19 ఏళ్ళ కుర్రాడు

బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లగా కేశవులు పారిపోయాడు. తర్వాత స్థానిక మహిళలు దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాణిపాకం పోలీసులు మూడు నిమిషాల్లో గ్రామానికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేశవులుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌.ఐ. చెప్పారు.



సంబంధిత వార్తలు

Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్