AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, లంచం తీసుకుంటే జైలుకే, మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామాల్లో పచ్చదనం బాధ్యత ఆ గ్రామ సర్పంచ్‌లదే, మీడియాతో మంత్రి పేర్ని నాని

ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు.

AP Cabinet Takes Key Decisions On Local Body Elections Municipal polls be held before 15th March (photo-Twitter)

Amaravathi, Febuary 12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు.

దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్

మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) మీడియా మాట్లాడుతూ.. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు (Municipal polls) నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ (AP Local Body Election) పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్

డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని, గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వర్తిందని మంత్రి నాని హెచ్చరించారు.

టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి

రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై ఆ గ్రామ్ సర్పంచ్‌లదే అని స్పష్టం చేశారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను ఎస్టీలకే కేటాయిస్తామన్నారు. తాగునీటి అవసరాలు, ప్రకృతి వైపరిత్యాల నివారణకై సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడించారు. జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతుల ఉచిత విద్యుత్‌ కోసం రూ.8వేల కోట్లు కేటాయించామని తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1500 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌

ఈ కేబినెట్ భేటీ ముగియగానే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. నేటి (బుధవారం) సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు.