Nimmagadda Ramesh Kumar: ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్, నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా (State Election Commissioner) ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. దీనికి సంబందించి నిబంధనలు సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Governor Bhusan Haricchandan) ఆమోదం తెలిపారు. ఎస్.ఇ.సి.పదవి కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Amaravati, April 11: ఏపీ ప్రభుత్వం (AP Govt) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా (State Election Commissioner) ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబందించి నిబంధనలు సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Governor Bhusan Haricchandan) ఆమోదం తెలిపారు.
ఎస్.ఇ.సి.పదవి కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా నిబంధనల ప్రకారం రమేష్ కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.
ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ 2016 ఏప్రిల్ 1వ తేదీన ఆ బాధ్యతల్లో చేరారు. నాలుగేళ్లకు పైగానే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఎస్‌ఈసీ పదవీకాలం మూడేళ్లు. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయింది. దీంతో ఆయన స్థానంలో.. ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త ఎస్‌ఈసీ రానున్నారు.
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు
ఈ జీవోలకు రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. న్యాయ శాఖ జీఓ 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. ఇక్కడ తొలగింపు అనడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 617,618 జివొల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం (ఎస్‌ఇసి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని గవర్నర్ నియమించే అధికారం ఉంటుంది. గవర్నర్ ఇసిని నియమించాక అతని పదవీకాలం 5 ఏళ్లుంటుంది. ఈక్రమంలో ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ ఉండదు. ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ (ఇసి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపునకు వర్తిస్తుంది. కాగా హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదించారు. ఈ జివొల ప్రకారం రమేష్ కుమార్ ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదే
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అవకతవకల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ రాసినట్లుగా వార్తలు హల్ చల్ చేసిన సంగతి విదితమే. అదేవిధంగా తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కోరినట్లుగా ఆ లేఖలో ఉంది. దానిని కేంద్ర హోం శాఖకు రాసినట్టు ఆ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎస్ఈసీ రమేష్ కుమార్ మాత్రం దానిని నిర్ధరించలేదు. ఈ పరిణామాలతో వ్యవహారం మరింత వేడెక్కినట్టు కనిపించింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా
ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి అధికారాలు, నిధుల గురించి 73,74వ రాజ్యాంగ సవరణల్లో స్పష్టంగా ఉందని, ప్రభుత్వ చర్యలు 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకమని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డను తొలగించడంపై ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
అసలేం జరిగింది ?
ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు తీర్పు కారణంగా రిజర్వేషన్ల అంశంలో మార్పులతో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వేగంగా పూర్తి చేసే ఉద్దేశంతో మార్చి నెలలో స్వల్ప వ్యవధిలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటుగా మునిసిపల్, పంచాయితీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేశారు.
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం పూర్తి అయ్యింది. పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంతా భావించిన సమావేశంలో అనూహ్యంగా మొత్తం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపివేస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ సర్కారు
ఎస్ఈసీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా, వ్యక్తిగత విమర్శలకు దిగారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కులాన్ని కూడా ప్రస్తావించారు. విచక్షణాధికారం అందరికీ అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు.
ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ ప్రకటించగా, వైద్య ఆరోగ్య శాఖతో గానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గానీ కనీసం సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వం తరుపున సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూనే వాయిదా వేసేముందు సంబంధిత అధికారులతో సంప్రదించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించింది.