Andhra Pradesh Cabinet Meeting: మరో రెండు రోజుల్లో తేలిపోనున్న రాజధాని వ్యవహారం, 20కి వాయిదా పడిన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజు.., రాజధానిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం
నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ (AP CM YS Jagan) అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. దీనికి కారణం లేకపోలేదు. రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Amaravathi, January 18: ఏపీ కేబినెట్ సమావేశం (Andhra Pradesh Cabinet Meeting)వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ (AP CM YS Jagan) అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. దీనికి కారణం లేకపోలేదు. రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 9 గంటలకు మంత్రి మండలి ఆమోదిస్తే, దానిని గవర్నర్‌కు (Governor)పంపి అనుమతి తీసుకుని రెండు గంటల్లోపే అసెంబ్లీ సమావేశాలకు(AP Assembly Session) తీసుకురావడంలో హడావుడి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అందుకని తొలుత శనివారమే కేబినెట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు.
అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు
అయితే, బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించి, మంత్రి మండలిలో ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో నిదానంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావించి మీటింగ్‌ను ముందుగా అనుకున్నట్టే సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించాలని నిర్ణయించి, ఆ మేరకు మంత్రులకు సమాచారం పంపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్ భేటి నిర్వహించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే రోజు హైపవర్ కమిటీ నివేదికను(High Power Committee) సీఎం జగన్ కు అంద చేయనున్నది.
మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు
ఈ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత వికేంద్రీకరణ, మూడు రాజధానులపై (AP Three Capitals ) ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ఈనెల 20న జరిగే అసెంబ్లీ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే బిల్లు బాస్ చేయించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
20న జరగబోయే సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. రాజధాని మార్పు (Capital Change) అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో ఈ నివేదికపై మంత్రిమండలి కూలంకశంగా చర్చించి ఆమోదించనుంది. రాజధాని మార్పుతో ఏర్పడే సమస్యలపై కూడా చర్చించనుంది. ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించనున్నారు.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల విషయంపై హడావుడిగా నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వం (AP Govt) భావిస్తోంది. కొంత సమయం తీసుకొని రైతులు(Farmers) నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రైతులతో పాటు 29 గ్రామాల్లో ఉన్న రైతు కూలీల సంక్షేమం పట్ల కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు
రైతులకు, రైతు కూలీలకు గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన సాయం కంటే రెట్టింపు చేయాలన్న భావనలో జగన్ ఉన్నారు. రైతులకు ఇచ్చే కౌలు, రైతు కూలీలకు ఇచ్చే పింఛను పెంచే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది. అసైండ్ భూముల రైతులకు కూడా సమన్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది.
క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇదిలా ఉంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణలు, దాడిని ఎదుర్కొని రాష్ట్ర ప్రజల మెప్పు పొందే విధంగా చర్చ జరపాలని జగన్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయా సబ్జక్ట్ లకు సబంధించిన అంశాలపై అధికారులతో స్టడీ చేయాలని మంత్రులకు సూచించారు.
జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు
అన్ని రాజకీయ పార్టీలు రాజధాని మార్పును వ్యతిరేకిస్తుండటం... అమరావతి ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రజల దృష్టి యావత్తూ కేబినెట్ సమావేశంపైనే ఉంది. అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసే అవకాశమున్నందున కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.