COVID-19 Under YSR Aarogyasri: ఉచితంగా మెరుగైన వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.., ఏపీలో 304కి చేరిన కరోనా కేసులు

ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Coronavirus Outbreak: China Reports 39 New Cases of COVID-19, One Death (Photo-IANS)

Amaravati, April 7: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ

కరోనాకు సంబంధించి మొత్తం 15 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి (AP Medical Health Department Secretary Jawahar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న వారిని ప్రైవేట్ ఆస్పత్రులు కూడా జాయిన్ చేర్చుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

కరోనా టెస్టులు, వ్యాధి నిర్ధారణతో కలిపి మ‌రికొన్ని వైద్య ప‌రీక్ష‌ల‌ ప్యాకేజీల‌ను నిర్ణ‌యిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. కనిష్ఠంగా.. రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.16లక్షల వరకు కరోనా వైద్య ఖ‌ర్చుల‌ను ఏపీ స‌ర్కార్ భ‌రించ‌నుంది.

17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు

కరోనా వైరస్‌ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు.

మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు 

వీటితో పాటు కరోనా పాజిటివ్‌ బాధితుడికి ఇతర అనారోగ్య సమస్యలుంటే, వాటికి కూడా చికిత్స చేసేలా అవకాశం కల్పించారు. అదేవిధంగా హెల్త్‌ వర్కర్స్‌ అందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే క‌రోనా బాధితుల‌ను గ‌వ‌ర్న‌మెంట్ అఫిషియ‌ల్స్ ప‌రిధిలోని ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో రెండో కరోనా మరణం

రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 51 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 304కు చేరుకున్నాయి. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్‌గా తేలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 304​కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు

ఇక జిల్లాల వారిగా అత్యధికంగా కర్నూలులో 74 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్‌ జిల్లాలో 27, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11, ప్రకాశం 24, అనంతపురంలో 6 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు