Special Investigation Team: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు, జీవోలో పోలీస్ స్టేషన్ ప్రస్తావన, ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు
భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati,Febuary 22 : గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని అమరావతిలో (AP capital Amaravati) భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) (Special Investigation Team (SIT)) జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాబుకు జడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం
రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు (Chandra Babu) ఐదేళ్ల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ను (Special Investigation Team) ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి (Kolli Raghuram Reddy) నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఆర్‌డీఏ ప్రాంతంలో భూ సేకరణతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ పరమైన లోపాలతోపాటు నకిలీ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉప సంఘం గుర్తించింది.
గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతోపాటు రాజధాని భూకుంభకోణంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నాటి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీల హస్తం ఉందని సమాచారం.ఈ అక్రమాలను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగిస్తూ ఈ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీలో కొత్త పెన్సన్ కార్డులు వచ్చేశాయి
సిట్ పనితీరు, విధి విధానాలను కూడా జీవోలో స్పష్టంగా పొందుపర్చారు. సిట్ అధికారులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆయా అంశాలపై విచారణ చేయవచ్చు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయవచ్చు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అంతేకాదు... తాము దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించుకుని, వారి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం కూడా సిట్‌కు ఉంటుంది.
జూన్ 1 నుంచి వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అమల్లోకి
ఇక... ఆయా అంశాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకుని పరిశీలించవచ్చు. సిట్‌కు అన్ని శాఖలు, అందరు అధికారులు సహకరించాల్సిందే. ఇదే జీవోలో పోలీసు స్టేషన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సిట్‌నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయి
మొత్తం 10మంది సభ్యులతో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇక సభ్యులుగా విశాఖ ఎస్పీ బాబూజీ అట్టాడ, ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ వెంకట అప్పలనాయుడు, కడప అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇంటెలిజెన్స్ డీఎస్పీ జయరామరాజు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ విజయభాస్కర్ సభ్యులుగా నియమించారు. వీరితోపాటు ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఎం. గిరిధర్, ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ కెన్నడీ, నెల్లూరు జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్, గుంటూరు జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ వి. రాజశేఖరరెడ్డి సభ్యులుగా ఉన్నారు.