Kurnool, Febuary 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మూడో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలులో (Kurnool) ఈ కార్యక్రమాన్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. YSR Navasakam
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని, అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)పేర్కొన్నారు.
గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు (YSR Kanti Velugu) పథకం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం (AP Govt) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
YSR Lifetime Achievement Awards
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఏం (Andhra Pradesh CM) మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 56 లక్షల 88 వేల 420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
Here's AP CMO Tweet
కర్నూలులో వైయస్సార్ కంటి వెలుగు మూడవ దశ ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
ఆస్పత్రులు నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సీఎం. pic.twitter.com/0FxUybQk6g
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 18, 2020
మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి కళ్లజోళ్లు అందజేస్తారని తెలిపారు.
ఇక రూ. 15,337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు, రెండో దశలో పీహెచ్‌సీ, కమ్యూనిటీ సెంటర్లలో రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు చేపడతామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్ ఆస్పత్రులు తీసుకువస్తాం. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామని, నర్సింగ్ కాలేజీలు కూడా పెంచుతామని సీఎం తెలిపారు. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడు అన్న పదం వినపడకూడదని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
66 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని.. 4 లక్షల 36 వేల మంది పిల్లలకు రెండోసారి స్క్రీనింగ్ చేశామన్నారు. లక్షన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు ఇచ్చామని తెలిపారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో కంటి చికిత్సలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్ కంటి పరీక్షలను ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు.
ఇక అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత 15 రోజుల్లో వాలంటీర్ల ద్వారా పింఛన్లతో పాటు కళ్ల జోళ్లను అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్చి 1 నుంచి శస్త్రచికిత్సలు చేయిస్తారు. కంటి వెలుగు పథకం ద్వారా ప్రభుత్వం రెండు విడతలుగా పాఠశాలల్లో 66 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేసింది. 4.36 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించింది ఇప్పుడు మూడో విడత ప్రారంభించారు.