Muslims Million March In HYD: జాతీయ జెండాతో ముస్లీం మిలియన్ మార్చ్, సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కదం తొక్కిన ముస్లీంలు..ముస్లీమేతరులు, అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ముస్లింలు మిలియన్ మార్చ్ (Muslims Million March) నిర్వహించారు. పౌర సవరణ చట్టం (CAA), జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC) లపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
Hyderabad, January 05: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ముస్లింలు మిలియన్ మార్చ్ (Muslims Million March) నిర్వహించారు. పౌర సవరణ చట్టం (CAA), జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC) లపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, ఎంబీటీ, తెహ్రీక్, అమెలే హదీస్, జమాతే ఇస్లామీ, తామిరేమిల్లత్‌తో పాటు పలు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్చం సంస్థలతో కూడిన 48 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ర్యాలీకి పిలుపునిచ్చింది.
ఇందిరా పార్కు దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో జరిగే సభకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నుంచి ట్యాంకు బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Here's Tweet On Million March
ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముస్లిం సంఘాల మిలియన్ మార్చ్‌కు (Million March)పోలీసులు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నా..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
తమిళనాడులో కొత్త తరహా నిరసన, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు
Here's Tweet On Million March
లక్షలాదిగా ముస్లింలు, నిరసనకారులు మిలియన్ మార్చ్‌కు తరలివచ్చారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ఓ చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ప్ల కార్డులు పట్టుకుని కదం తొక్కారు. ఎన్టీఆర్ స్టేడియం, ధర్నా చౌక్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలు జనాలతో నిండిపోయాయి.
నిరసనలతో అట్టుడుకుతున్న భారతదేశం, నిరసనకారుల మధ్య అల్లరిమూకలు
Here's Tweet On Million March
అసలే రద్దీ ప్రాంతాలు కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనాలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో వాహనాలు ఇరుక్కపోయాయి.
స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు
Here's Tweet On Million March
ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా.. నల్ల రంగు, ఆకుపచ్చ రంగు జెండాలను ప్రముఖంగా ప్రదర్శిస్తారు. అయితే.. ఈసారి వారి చేతుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం సామాన్య జనాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
యోగీ ప్రభుత్వం ప్రతీకార నిర్ణయం, 28 మంది ఆందోళన కారులకు నోటీసులు
Here's Tweet On Million March
దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల పిలుపునిచ్చారు. దీనికి అద్భుత స్పందన వచ్చింది. ముస్లింలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను రెపరెపలాడించారు. పాతబస్తీ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ముస్లిం సోదరులు త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగరేసి తమ దేశభక్తిని చాటుకోవడం కనిపించింది. పాతబస్తీలోని చాంద్రయణగుట్ట తదితర కీలక ప్రాంతాలతో పాటు గోల్కొండ, కార్వాన్, లంగర్ హౌజ్‌లో ముస్లింల ఇళ్లపై జాతీయ జెండాలు రెపరెపలాడటం కనిపిస్తోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)