Asaduddin Owaisi (Photo Credits; IANS/ File)

Hyderabad, December 22: నరేంద్ర మోడీ (Narendra Modi) నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ (AIMIM chief Asaduddin Owaisi) పిలుపునిచ్చారు. దేశంలో ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా (Tricolour Flag) ఎగరాలని,దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై (Citizenship Amendment Act (CAA)) దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన ఒవైసీ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి రావడం దారుణమన్నారు.

దీనిని కేవలం హిందూ, ముస్లిం సమస్యగా చూడరాదని, దేశానికి ప్రజలకు మధ్య ఉన్న సమస్యగా దీనిని చూడాలని ఒవైసీ అన్నారు. ఎన్ఆర్‌సీ వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఎన్ఆర్‌సీని కనుక అమలు చేస్తే దేశంలో చాలా వరకు రాష్ట్రాలు ఖాళీ అయిపోతాయన్నారు.

Here's ANI Tweet

దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఒవైసీ అన్నారు. దేశంలోని ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలని అన్నారు. మహాత్మాగాంధీ మనమధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని, అంబేద్కర్ లేకపోయిన ఆయన రచించిన రాజ్యాంగం మనతో ఉందని అన్నారు.

దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఒవైసీ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) చట్టాలంటే గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయ జెండాలతో సభా ప్రాంగణం

సీఏఏ, ఎన్నార్సీలకు(National Register of Citizens (NRC)) వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దారుస్సలాంలో జరిగిన భారీ సభలో అసద్‌ ప్రసంగించారు. ఎన్నార్సీ వల్ల నష్టాలే తప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకుతీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్‌ జాతీయ గీతాలాపనతో సభ ముగించారు.

మహత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌లు జీవించి లేనప్పటికీ వారి ఆశయాలు సజీవంగా ఉన్నాయని తెలిపారు. కేరళలో మాదిరిగా తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) అమలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్దులు కూడా పాల్గొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి.