CM KCR Press Meet: ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు, కొత్త కేసులు నమోదు కాకుంటే జరిగేది అదే, తెలంగాణలో 70కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మీడియతో సీఎం కేసీఆర్

మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, Mar 29: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ (Covdi 19 in Telangana) చాపకింద నీరులా మెల్లిగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు దానిపై సమీక్షలు నిర్వహిస్తూ దాని కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియా ముందుకు (CM KCR Press Meet) మరోసారి వచ్చారు.

తెలంగాణాలో తొలి కరోనావైరస్ మరణం

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases) 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని తెలిపారు. మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్

కరోనా వచ్చిన 76 ఏళ్ల వ్యక్తికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. ఆయన ఒక్కరు తప్పించి మిగతా వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని పంపించే ముందు పక్కాగా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటాం. క్వారంటైన్‌లో ఉన్న 27వేల 937 మందిపై నిఘా ఉంది. వారిలో 11 మంది కోలుకున్నారు..వారిని సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారని తెలిపారు.

తెలంగాణ డీఎస్పీ నిర్లక్ష్యం, కొడుకు ద్వారా తండ్రికి, వంటమనిషికి కరోనా వైరస్

లాక్‌డౌన్‌పై భారత్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. సీరియస్‌గా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. వైద్యులు, పోలీసులకు అందరూ సహకరించాలని సీఎం కోరారు. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి ద్వారా 50వేల మందికి వచ్చింది. అయితే ఇక్కడ కొత్త కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది.

కరోనాపై నిర్లక్ష్యం, కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు

కొత్త కేసులు చేరకుంటే ఏప్రిల్‌ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి మందులేదు సెల్ఫ్‌ కంట్రోల్‌ మాత్రమే మన ఆయుధమని అన్నారు. మార్చి 30 నుంచి క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నవారినందరినీ డిశ్చార్జ్‌ చేస్తామని సీఎం పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Astrology: డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..