Hyd, December 19: ఎన్టీఆర్ ఘాట్ కూల్చేయాలని తాను అన్నట్లు కొంతమంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబిలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆ పార్టీ ట్రాప్లో పడేది లేదన్నారు.
మంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుంది.. అది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి రాలేదని బీఆర్ఎస్ ట్రాప్లో పడతానని కొంతమంది భావిస్తున్నారు కానీ అలా జరగదన్నారు. రాజగోపాల్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రా? మంత్రా? అని అడిగారు వివేకానంద. పదవులు ఇప్పటి వరకు నేను అడుక్కోలేదు... అధిష్ఠానం అనుకున్న వాళ్లకు మంత్రి పదవి ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల చేసింది చాలా ఎక్కువ... మేం చాలా తక్కువ చేస్తున్నాం అన్నారు.
నేను ఉంటే... బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉండేదని, బీఆర్ఎస్ హయంలో వివేకానంద కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని మేం గతంలో అడిగామా ? చెప్పాలన్నారు. ఆంధ్ర మీడియా తెలంగాణ రాజకీయ నేతలను శాసించాలను చూస్తోందని.... ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం చేశాం అన్నారు. మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు... దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి చెబుతాం అన్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రులే ప్నశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్
ఎన్టీఆర్ అంటే అభిమానం ఉంది.. ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలని నేను ఎందుకు అంటాను అన్నారు. అనని మాటను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు... మా మీద కుట్ర చేస్తున్నారు అన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని, బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళలో కొందరు కాంగ్రెస్ లోకి వస్తారు.. మరికొందరు బీజేపీలోకి వెళ్తారన్నారు. నల్ల చొక్కాలు వేసుకున్నా.. ఆటో డ్రైవర్ల డ్రెస్ వేసుకున్నా BRS నేతలకు చివరగా జైలు డ్రేసే గతి అని చురకలు అంటించారు కోమటిరెడ్డి.
చరిత్ర విలువ తెలియదు మహోన్నతులను గౌరవించడం చేతకాదు అన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు?, పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా? అని ప్రశ్నించారు. మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా?,
ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు అన్నారు.