Hyd, Dec 15: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ కేసులో ప్రియురాలు అనసూర్య(29)ను అరెస్ట్ చేశారు పోలీసులు. బానోత్ అనసూర్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు పరిచయమైంది అనసూర్య.
హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆమె గురించి ఆరా తీసిన హరీష్‌కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని విషయం తెలిసింది. ఎస్సీ - ఎస్టీ కేసు....ఆత్మహత్య డ్రామా...వెరసీ ఎస్‌ఐ ఆత్మహత్య..వాజేడు ఎస్ఐ హరీష్ ఘటనలో పోలీసుల నిర్థారణ
దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.వినకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. లేదంటే సూసైడ్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేయడంతో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఎస్‌ఐ.