Telangana Assembly Sessions..5th day updates(X)

Hyd, December 19:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..కేబినెట్‌ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటి అని చురకలు అంటించారు.

మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుంది...గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారన్నారు. వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని..నల్లగొండ జిల్లా, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించేదే బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందే, తాము ఏం చేశామో చర్చ పెట్టాలన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. భూ భారతి చట్ట ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వగా శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారని నోటీసులో పేర్కొంది. ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.  అధికారులకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, స్టే ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం..అధికారుల సొంత ఖర్చులతో తిరిగి కట్టించాలని ఆదేశం

అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నాం అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టేషన్‌ఘన్‌పూర్‌ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశాం.. త్వరలో టెండర్లు పిలుస్తాం అన్నారు. ఇరిగేషన్‌ శాఖను బలపరుస్తున్నాం...పదేళ్లుగా ఇరిగేషన్‌ శాఖలో నియామకాలు లేవు అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక 700 మందిని ఇరిగేషన్‌ శాఖలోకి తీసుకున్నాం...బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశాం అన్నారు. రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు పూర్తి చేస్తాం అన్నారు.

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల కుల సంఘాల అసెంబ్లీ ముట్టడించగా వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్. కొత్త పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదు..3 బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నాం అన్నారు. ఇక ఇవాళ అసెంబ్లీకి ఎడ్లబండిపై వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.