Telangana Coronavirus: తెలంగాణలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్, తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌కి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ
ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు (Nizamabad Urban MLA Bigala Ganesh) కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు.నిజామాబాద్ జిల్లా (Nizamabad) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.
Hyderabad, June 15: తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు కరోనావైరస్ (Telangana Coronavirus) భారీన పడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు (Nizamabad Urban MLA Bigala Ganesh) కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు.నిజామాబాద్ జిల్లా (Nizamabad) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ
గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కొవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవ్వడం వల్లే వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం, పలు స్టేషన్లలోని పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఎమ్మెల్యే గోవర్ధన్ కలిసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది.
తెలంగాణలో జర్నలిస్టులపై కరోనా పంజా
ఇక తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కు చేరింది. శనివారం జర్నలిస్టులు, కొందరు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా సోకినట్టు ఆదివారం ఫలితాలొచ్చాయి.
ఇంతకు ముందటి మూడు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు వ్యాధి సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా వ్యాధి బారినపడిన జర్నలిస్టుల సంఖ్య 70కు చేరిందని జర్నలిస్టుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఓ తెలుగు వార్తా చానల్‌లో పనిచేసిన మనోజ్‌కుమార్ అనే జర్నలిస్టు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది.