Telangana Lockdown 3.0: మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోంది, స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి అమల్లోకి ఈ పాస్ విధానం, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం విజ్ఞప్తి

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి.. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం. రెండు.. రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలు నిర్దిష్ట వేళల్లో తెరిచేందుకు అనుమతివ్వడం.

Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, May 4:  దేశ వ్యాప్తంగా మే 4 నుంచి వలస కార్మికులకు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు (Telangana Govt) కూడా లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి వెసులుబాటు కల్పించింది. పర్యాటకం, విద్య, ఉద్యోగం తదితర కారణాల వల్ల తమ స్వస్థలానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ-పాస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.  తెలంగాణలో కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు నమోదు, ఆరెంజ్ జోన్‌లో ఉన్న జగిత్యాల నుంచి మరో కేసు నమోదు, రాష్ట్రంలో 1082కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

స్వస్థలానికి వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass అనే లింక్‌ తెరిచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Director General of Police M Mahender Reddy) ట్వీట్ చేశారు. తద్వారా ఈ-పాస్‌ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబంలో రోజుకు ఒకరికి మాత్రమే ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని పోలీసులు చెప్పారు.

ఈ-పాస్‌‌తో సొంత ప్రాంతానికి వెళ్లాలనుకొనే వారు పేరు, ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు అందులో వెల్లడించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని వారు ధ్రువీకరించుకొన్న అనంతరం ఆన్‌లైన్‌లోనే ఈ పాసులను జారీ చేస్తారు.

Here's DGP Tweet

లాక్ డౌన్ (Telangana Lockdown 3.0) వల్ల అనుకోకుండా చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారిని స్వస్థలాలకు జాగ్రత్తగా పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. దీని ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

రెవెన్యూ, పోలీస్, మెడికల్‌ సిబ్బంది వారికి పరీక్షలు చేసి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షిస్తారు. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను నమోదు చేసుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండాలని మార్గదర్శకాల్లో సూచించారు.   తెరుచుకోనున్న మద్యం షాపులు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇలా వస్తున్న వారికి కొన్ని సూచలను చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను మాత్రమే వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిందని.. ఈ విషయాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అర్ధంచేసుకుని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్రానికి దాదాపు లక్షమంది వచ్చే అవకాశముందని.. వారందరినీ క్వారంటైన్‌ చేసేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో లక్ష పడకల ఏర్పాటుకు తక్షణం మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు.  దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0

ఎక్కడి వారు అక్కడే ఉండాలి : ఏపీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సమీక్ష జరిపిన అనంతరం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని సీఎం జగన్ కోరారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆయన చెప్పారు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలను మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు .ఏపీకి రావాల్సిన వలస కూలీలు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారని, వలస కూలీలను క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రయాణాలతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని, అందువల్ల ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే తెలంగాణలో ఈ పాసులు తీసుకుని సరిహద్దు వరకూ వెళ్లిన వారిని చెక్ పోస్టు అధికారులు అనుమతించ లేదు.దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఏపీ నుంచి వెళ్లే వాహనాలను తెలంగాణ అధికారులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలను ఆ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి సిబ్బంది ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలో కలెక్టర్ల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. దీంతో ఇరువైపుల సరైన పత్రాలు కలిగిన వాహనాల ప్రయాణానికి అనుమతించారు.  మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 ఉండగా, జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1082కి చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా 46 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా, ఇప్పటివరకు మొత్తం 545 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. 29 మంది కరోనాతో మరణించగా.. మరో 508 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం

కరోనా- లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం నిర్ణయించాయి. ఇప్పటివరకు అమలుచేస్తున్న కఠిన ఆంక్షలను సోమవారం (మే 4వ తేదీ) నుంచి సడలించాలని నిశ్చయించాయి. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు మద్యం దుకాణాలు తెరిచేలా ఉత్తర్వులు జారీచేశాయి.  కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి.. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం. రెండు.. రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలు నిర్దిష్ట వేళల్లో తెరిచేందుకు అనుమతివ్వడం. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో సరిహద్దులను పూర్తిగా మూసివేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇక రెండోది మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించడం. దీనివల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



సంబంధిత వార్తలు