Telugu States Coronavirus: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో 439కి చేరిన కేసుల సంఖ్య, తెలంగాణలో 592కు చేరిన కోవిడ్ 9 కేసులు

రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 19 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో ఇప్పటివరకు కోవిడ్ 19 భారీన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఏడుమంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

COVID-19 in Telangana | (Photo Credits: IANS)

Hyderabad, April 14: తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Telugu States Coronavirus) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 19 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో ఇప్పటివరకు కోవిడ్ 19 భారీన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఏడుమంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

ఏపీలో (Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా పట్టి పీడిస్తోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి చేరింది. నిన్న ఒక్కరోజు 19 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో అత్యధికంగా 93 కేసులు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు.

ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా.. కర్నూల్‌ జిల్లాలో ఒక కోవిడ్‌ మృతి నమోదైంది. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 401 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 420 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

ఇక జిల్లాల వారిగా చూస్తే.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 93 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 56, కృష్ణా జిల్లాలో 36, ప్రకాశంలో 41, కడప 31, పశ్చిమ గోదావరిలో 23, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నంలో 20, అనంతపురంలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 17 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 592కు చేరింది. నిన్న ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 103 మంది బాధితులు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 472 మందికి చికిత్స అందిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 216, నిజామాబాద్‌లో 35, రంగారెడ్డిలో 20, వరంగల్‌ అర్భన్‌లో 21, జోగులాంబ గద్వాలలో 20, కరీంనగర్‌లో 4, మేడ్చల్‌లో 18, ఖమ్మంలో 7, నల్లగొండలో 12, ఆదిలాబాద్‌లో 11, నిర్మల్‌లో 18, కామారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 11, సూర్యపేటలో 20, సంగారెడ్డిలో6, మెదక్‌లో 3, వికారాబాద్‌లో 24, జగిత్యాలలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, జయశంకర్‌ భూపాలపల్లిలో ౩, ములుగులో 2, నాగర్‌కర్నూల్‌లో2, పెద్దపల్లిలో 2, ఆసిఫాబాద్‌లో 3, సిద్ధిపేటలో1, మహబూబాబాద్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.