Telangana DGP: వైద్యులు, సిబ్బందిపై దాడి చేస్తే అరెస్ట్, వాట్సప్ గ్రూపులను సమన్వయం చేసుకుని వెళ్లండి, ప్రకటన విడుదల చేసిన తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి, కార్యాలయంలో సేఫ్టీ టన్నెల్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో (Telangana States) కూడా కొన్ని చోట్ల వైద్యులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యులపై జరుగుతున్న దాడుల ఘటనలపై డీజీపీ మహేందర్‌రెడ్డి (Director General of Police M Mahender Reddy) ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే చేస్తున్న సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Hyderabad, April 5: దేశ వ్యాప్తంగా వైద్యం చేస్తున్న డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో (Telangana States) కూడా కొన్ని చోట్ల వైద్యులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యులపై జరుగుతున్న దాడుల ఘటనలపై డీజీపీ మహేందర్‌రెడ్డి (Director General of Police M Mahender Reddy) ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే చేస్తున్న సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు
మండలాల వారిగా, పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు (WhatsApp groups) ఏర్పాటు చేశాం. పోలీస్ కమిషనరేట్లు, ప్రభుత్వ వైద్యశాలల పరిధిలో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సప్ గ్రూపులను సమన్వయం చేసుకుని వెళ్లాలని పోలీసులకు, వైద్యులకు సూచించారు.హైదరాబాద్‌లో (HYD) మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో పోలీస్ మెడికల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
వీరంతా ఒకరికొకరు సమన్వయం చేసుకుని సర్వేలకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వైన్ షాపు పగులకొట్టి మద్యం లూటీకి పాల్పడిన దుండుగులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ( Corona virus in Telanagana) పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. శనివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Here's DGP TELANGANA POLICE Tweet
మున్ముందు ఎలాంటి క్లిష్ట, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ శాఖ సిబ్బందిని ఆదేశించారు. వ్యాధి వేగంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.
రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని ప్రధాని పిలుపు
వ్యాధి వ్యాప్తి ప్రమాదకర దశలో ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. స్టేషన్ వచ్చేవారికి చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసే సమయంలో హెల్మెట్ తదితరాలు భద్రత కోసం ధరించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తులను తరలించే సమయంలో 108, వైద్య, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
రూ.30 వేల కోట్లకు పటేల్ విగ్రహం అమ్మకం
ఈ అన్ని శాఖలతో ప్రతీ పోలీస్ ఠాణా పరిధిలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచిం చారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాక విధిగా స్నానం చేయాలని, కమ్యూనికేషన్ డివైజ్‌లను నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాం తంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
తబ్లిఘీతో సంబంధమున్న వారి కాల్ డేటాపై నిఘా
కాగా కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్ టన్నెల్‌ను (3V Safe Tunnel) డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
Here's 3V Safe Tunnel AT Telangana DGP Office
శనివారం సాయంత్రం డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ పరికరాన్ని ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తాయి.
ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ
ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది.