Telugu States CMs with PM: రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని, వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు.

Telugu States CMs with PM (Photo-ANI)

Hyderabad, May 11: మే 17తో మూడవ దశ లాక్‌డౌన్‌ (Lovkdown 3.0) ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ (pm modi's vc interactions with cms) నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు.  కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు

వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని, వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు. మన ముందు పెద్ధ ఛాలెంజ్ ఉంది, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రారంభమైన ప్రధాని మోదీ 5వ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం

అదే సమయంలో కరోనా వైరస్‌ గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి కొన్ని సూచనలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan)

ప్రజల్లో భయం, ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌పై కేంద్రం సూచనలు, సలహాలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. తద్వారా కరోనా పాజిటివ్‌ కేసులను నియంత్రించగలిగామన్నారు. 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

రాష్ట్రంలో ఇప్పటికే మూడు పర్యాయాలు సమగ్ర సర్వే చేపట్టామని, దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. వారందరికీ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కోవిడ్‌ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని, కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఏపీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారిని సమాజం వేరుగా చూస్తుందన్న భావన నెలకొందని.. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు కరోనా పరీక్షల ముఖ్య ఉద్ధేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోందన్నారు. బెడ్ మీద కరోనా శవాలు, పక్కన నేల మీద రోగులు, ముంబై కెమ్ ఆస్పత్రి వీడియోని ట్విట్టర్లో షేర్ చేసిన నితేష్ రాణే, అలాంటిదేమి లేదన్న శివసేన

ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో వ్యవహరించాల్సి ఉందని.. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లేలా అప్రమత్తం చేయాలని ప్రధానికి ఏపీ సీఎం తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌తో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Telangana CM KCR)

కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సూచించారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెరుచుకున్న ఐటీ కార్యాలయాలు, హైటెక్ సిటీ వైపు క్రమంగా పెరుగుతున్న రద్దీ, మెట్రో,ఎంఎంటీసీ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు

కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి రైళ్ల పునరుద్ధరణపై మరోసారి ఆలోచించాలని కోరారు.  కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్

కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే చాన్స్ ఉంది. జూలై-ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లపై రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు, ఇకపై 1700 మంది వలస కార్మికులను తీసుకెళ్లనున్న స్పెషల్ రైళ్లు, గమ్యస్థానానికి చేరిన 363 రైళ్లు

కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నాం. పరికరాలు, మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు. కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడింది. ఆదాయాలు లేవు. అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలి. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు.  విద్యుత్ శాఖ‌ ఉద్యోగికి కరోనా, ఢిల్లీలో మూత‌పడిన శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్, త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఏప్రిల్‌ 13, మే 3 వరకు మరో రెండు దఫాలు లాక్‌డౌన్‌ పొడిగిచింన మోదీ సర్కారు.. మూడోసారి మే 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చింది.