Jio New Warning: కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన జియో, మీకు వచ్చే ఓ లింక్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు, ఆ లింక్ గురించి పూర్తిగా తెలుసుకోమని అలర్ట్ మెసేజ్,ఇంతకీ అదేంటీ ?

జియో పేరుతో వస్తున్న వదంతులను ఏవీ నమ్మవద్దని తెలిపింది.

reliance-jio-is-warning-users-about-this-new-scam (Photo-PTI)

October 14:  దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు హెచ్చరికతో కూడిన అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. జియో పేరుతో వస్తున్న వదంతులను ఏవీ నమ్మవద్దని తెలిపింది. జియో గురించిన ఏదైనా కొత్త సమాచారం వస్తే ముందుగా రిలయన్స్ జియో అఫిషియల్ వెబ్ సైట్లో దాని గురించి ముందుగా తెలుసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య జియో పేరుతో వస్తున్న లింకుల గురించి యూజర్లని అలర్ట్ చేసింది. ఆ లింక్ పట్ల యూజర్లంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని, లింక్ క్లిక్ చేస్తే డేటా చోరీ అవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చింది.  జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది

జియో పేరు మీద కొత్త స్కామ్ (Jio New Scam) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గుర్తించిన రిలయన్స్ జియో సంస్థ వెంటనే అలర్ట్ అయి, వినియోగదారులను అప్రమత్తం చేసింది. అధికారికంగా ఓ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా అనేకమంది రిలయన్స్ జియో యూజర్లకు ''Good News!! Jio is giving free 25GB Data Daily for 6 months. Download app and register to activate offer link: **tiny url**” ఒక SMS వస్తోంది. దీన్ని క్లిక్ చేయవద్దని తెలిపింది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మన ప్రమేయం లేకుండానే My Prime అనే apk ఫైల్ ఫోన్ లోకి డౌన్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత మన డేటా మొత్తం హ్యాక్ అవుతుంది.  ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు

తర్వాత వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరిపోతుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలని కోరింది. ఇది మాత్రమే కాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో రిలయన్స్ జియో యూజర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తాం అనే పేరుతో అనేక నకిలీ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. ఈ నకిలీ అప్లికేషన్లు, నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి 

జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు

మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా