Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..
Jio Exclusive Offers For Festive Season (Photo-Twitter)

Mumbai,October 7:  దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా 2జీ మార్కెట్‌పై కన్నేసింది. యూజర్లంతా 4జీ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ 2జీ మార్కెట్లో యూజర్లు చాలామందే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం దేశంలో 35కోట్ల మంది నేటికీ 2జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగిస్తున్నారు. వీరందరినీ తమ నెట్‌వర్క్‌లోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తక్కువ మొత్తంలో నాణ్యమైన సేవలను అందించేందుకు రూ.699లకే జియో ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో రూ.1500లు ఉన్న జియో ఫోన్ కేవలం రూ.699లకే అందిస్తోంది. దీనిద్వారా ఉచిత వాయిస్ కాల్స్, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందుబాటులో రానున్నాయి. ద‌స‌రా, దీపావ‌ళి పండుగలను దృష్టిలో పెట్టుకుని భారీ ఆఫర్‌ను వినియోగదారుల మందుకు తీసుకొచ్చింది. దీంతో యూజర్లకు ఒకేసారి రూ.800 పొదుపు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. రూ.1500 ఫీచర్ ఫోన్‌ని రూ.700కే సొంతం చేసుకోండి

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 2జీ ఫీచర్ ఫోన్లన్నింటితో పోలిస్తే ఇంత తక్కువ ధరకు లభిస్తున్న హ్యాండ్‌సెట్ జియో ఫోన్ ఒక్కటేగా చెప్పుకోవచ్చు. యూజర్లు కేవలం రూ.700 చెల్లించడం ద్వారా 2జీ నుంచి 4జీ ప్రపంచంలోకి మారిపోవచ్చు. అలాగే రూ.693 విలువైన అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్‌లో భాగంగా జియోఫోన్ కొంటే మొదటి 7 రీఛార్జ్‌లకు జియో రూ.99 చొప్పున డేటాను ఏడు నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్, ఎడ్యుకేషన్, లెర్నింగ్, ట్రైన్ లేదా బస్ బుకింగ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ వీటన్నింటినీ ఈ ఫోన్లో జియో అందిస్తోంది.