EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం
state-bank-of-india-offers-emi-facility-on-its-debits-cards (Photo-File image)

Hyderabad: బ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు కేవలం క్రెడిట్ కార్డుల ద్వారానే వస్తువులను కొనుగోలు చేసి ఈఎంఐ పెట్టుకునే సదుపాయం ఎస్‌బీఐలో అందించారు. కానీ ఇకపై డెబిట్ కార్డులు ఉన్నవారు కూడా తమకు కావల్సిన వస్తువులను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే సౌకర్యం అందిస్తున్నారు. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా వస్తువులను కొంటే 6 నుంచి 18 నెలల వరకు ఈఎంఐ పెట్టుకునే సదుపాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 1500కు పైగా నగరాలు, పట్టాణల్లో ఉన్న 40వేలకు పైగా మర్చంట్లు, స్టోర్స్‌లో ఎస్‌బీఐ వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లకు సంబంధించిన ఆర్థిక స్థితి, వారి క్రెడిట్ హిస్టరీని బట్టి డెబిట్ కార్డు ఈఎంఐ లిమిట్ అందివ్వనున్నారు.

వినియోగదారులు 567676 నంబర్‌కు DCEMI అని తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపిస్తే తాము ఈ సదుపాయానికి అర్హులవుతారో, కారో తెలుసుకోవచ్చు. అలాగే తమకు కేటాయించబడిన క్రెడిట్ లిమిట్ వివరాలు కూడా ఇందులో తెలుస్తాయి. కాగా అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 32 కోట్ల మంది ఎస్బీఐ అకౌంట్ యూజర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం కనీస నగదు జమ (MAB) చేయని కస్టమర్లకు ఇకపై ఎస్బీఐ సర్వీసు ఛార్జీలను విధించనుంది. దీంతో పాటుగా భారంగా మారిన NEFT, RTGS ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. మెట్రో సిటీ, అర్బన్ ఏరియా బ్రాంచ్ ల్లో అకౌంట్ దారులకు అంతకుముందు నెలవారీ నగదు జమ రూ.5వేలు వరకు ఉండగా ఇప్పుడు రూ.3వేల పరిమితి విధించింది.

వస్తువును కొనుగోలు చేసిన తరువాత దాన్ని ఈఎంఐ కింద మార్చుకోవడం ఎలా ?

వినియోగదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే దానిపై EMI ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. PoS మిషన్ ద్వారా డెబిట్ కార్డును స్వైప్ చేసి దీన్ని పొందాలి. ట్రాన్సాజెక్షన్ పూర్తి చేసిన నెల తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ ప్రారంభం అవుతుంది. మొత్తం ఆరు నెలల నుంచి 18 నెలల కాల వ్యవధి వరకు మీరు ఈ ఆప్సన్ పెట్టుకోవచ్చు. కాగా ఎలాంటి ప్రాసిసెంగ్ ఫీజు లేకుండా, బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా యూజర్లు జీరో డాక్యుమెంటేషన్‌తో EMI బెనిఫెట్స్ పొందవచ్చు