Mumbai, October 11: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రిలయన్స్ అలర్ట్ అయింది. ట్విట్టర్ ద్వారా వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. జియో ట్వీట్ ప్రకారం అక్టోబర్ 9న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ ఇతర టెల్కో నంబర్లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది. ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు
ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్ ట్విటర్ పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు అందుబాటులోఉంటాయని తెలిపింది.
జియో ట్వీట్
An important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC
— Reliance Jio (@reliancejio) October 10, 2019
యూజర్లు రీఛార్జ్ చేసుకున్న టారిప్ ప్రకారం ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ చేయవచ్చు. రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది
ఆ తరువాత, ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్‌గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్‌లలో ఒకదానితో ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాగా జియో ఈ వారం ప్రారంభంలో రూ. 10 - రూ. 100 లోపు నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్‌లను ప్రకటించింది. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు టాక్ టైం అందిస్తున్నాయి.