Mobile Bill May Rise: మళ్లీ పేలనున్న మొబైల్ బాంబు, టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు, 25 నుంచి 30 శాతం వరకూ పెరిగే అవకాశం, విపరీతంగా పెరిగిన మొబైల్ వినియోగం

దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telecom companies starved for funds, your mobile bill may rise up to 30%( Photo-PTI)

New Delhi,January 30: టెల్కోలు మళ్లీ మొబైల్ యూజర్లపై బాంబును పేల్చేందుకు రెడీ అయింది. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏజీఆర్‌ చెల్లింపులపై సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వనరుల సమీకరణ కోసం కాల్‌ చార్జీల పెంపునకు ఈ కంపెనీలు మొగ్గుచూపనున్నాయి. యూజర్‌ నుంచి సగటు రాబడి రూ 180 కంటే తక్కువగా ఉండటంతో కొంచె పెంచితే రాబడి రావచ్చనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి.

3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

అదీకాకుండా ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లోనే తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు.

యూజర్లకు జియో షాక్, 40 శాతం పెరిగిన టారిఫ్ ధరలు

కాగా గత నెలలో భారతి ఎయిర్‌టెల్‌(Airtel), వొడాఫోన్‌ ఇండియా Vodafone), రిలయన్స్‌ జియో(Jio) మూడేళ్లలో తొలిసారిగా కాల్‌ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే.

యూజర్లకు టెల్కోల షాక్

టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్‌ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల కిందటి మొత్తంతో పోలిస్తే చాలా స్వల్పమని సెల్యులార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ అన్నారు.

ఛార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్

డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్‌ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్‌ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు యూజర్లు వెనుకాడరని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ చెప్పుకొచ్చారు.