Coronavirus: కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది, ఆ సత్తా భారత్‌కు ఉంది, డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మైకేల్ ర్యాన్ వెల్లడి, పాకిస్తాన్‌లో 959 కరోనా కేసులు
కరోనా వైరస్‌ను (Deadly Coronavirus) ఎదుర్కోవడంలో భారత్ (India) చేపడుతున్న అసాధారణ, కఠిన చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో పోలియో, మశూచి (స్మాల్‌పాక్స్) వంటి పెద్ద మహమ్మారులను జయించిన భారత్ ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కితాబిచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ భారత్‌కు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ (WHO Executive Director Michael J Ryan) తెలిపారు.
Geneva, Mar 25: కరోనా వైరస్‌ను (Deadly Coronavirus) ఎదుర్కోవడంలో భారత్ (India) చేపడుతున్న అసాధారణ, కఠిన చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో పోలియో, మశూచి (స్మాల్‌పాక్స్) వంటి పెద్ద మహమ్మారులను జయించిన భారత్ ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కితాబిచ్చింది.
కరోనాపై ఇండియా ఘనవిజయం, 48 మంది పేషెంట్లు రికవరీ
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ భారత్‌కు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ (WHO Executive Director Michael J Ryan) తెలిపారు.
21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్
జెనీవాలో ఆయన మాట్లాడుతూ..జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశమైన భారత్‌కు కోవిడ్ 19ను (COVID-19) ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. 1977లో మశూచిని పూర్తిగా అరికట్టిన భారత్, 2014లో పోలియో రహిత దేశంగా నిలిచింది. ఇప్పుడు కరోనాని కూడా ఇండియా నుంచి తరిమేస్తుందని అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు
కాగా కొవిడ్-19 మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికీ దాన్ని కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ‘‘డిసెంబరు చివర్లో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి సోకడానికి 67 రోజులు పట్టింది. అక్కడి నుంచి మరో లక్ష మందికి సోకడానికి కేవలం 11 రోజులు పట్టింది. ఆ తర్వాత.. మూడో లక్షకు చేరడానికి కేవలం నాలుగంటే నాలుగే రోజులు పట్టింది.
తెలంగాణలో 36కు పెరిగిన కరోనాపాజిటివ్ కేసులు
కొవిడ్-19 బాధితులకు చేసే చికిత్సలో భాగంగా ‘పరీక్షించని మందులను (అన్‌టెస్టెడ్ డ్రగ్స్)’ ఇవ్వవద్దని.. డ్రగ్ ట్రయల్స్‌ను ఎలా పడితే అలా నిర్వహించవద్దని పరిశోధకులను కోరారు.
Here's ANI Tweet
సరైన ఆధారాలు లేకుండా.. పరీక్షించని మందులను రోగులకిస్తే అది వారిలో అనవసరపు ఆశలను రేకెత్తిస్తుందని, దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రజలు ఆ మందుల కోసం ఎగబడితే.. ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆ మందులపై ఆధారపడేవారికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా?
ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’ (Janata Curfew)స్ఫూర్తిదాయకమని అమెరికా ప్రశంసించింది. ప్రధాని మోదీ (PM Modi) పిలుపుతో ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేయడం, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం ప్రకటించడం స్ఫూర్తిదాయకమని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయక కార్యదర్శి ఆలీస్ జీ వెల్స్ ట్విట్టర్‌లో ప్రశంసించారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సోమవారం అక్కడి భారతీయ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారతీయ కంపెనీలు స్థానిక ప్రజలకు ఎంతో అండగా ఉంటున్నాయని కొనియాడారు.
కరోనాపై నిర్లక్ష్యం, కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
కొవిడ్-19 వైరస్ గాలిలో వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్పష్టం చేశారు. ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాల్లేవని.. కేవలం దగ్గు, తుమ్ము తుంపర్ల ద్వారా, వైరస్ బారిన పడినవారిని తాకడం, వారికి దగ్గరగా మసలడం ద్వారానే వ్యాపిస్తుందని తేల్చిచెప్పారు. అయితే.. గాలి, వెలుతురు రాని ప్రదేశాల్లో, ఎక్కువ సమయంపాటు మూసి ఉండే ప్రదేశాల్లో మాత్రం ఈ సమస్య ఉండొచ్చని చైనా అధికారులు తెలిపినట్టు ఆమె వివరించారు.
లాక్‌డౌన్ పట్టని జనం, నిత్యావసరాల కోసం మార్కెట్లలో రద్దీ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,21,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 18,810 మంది మరణించారు. 1,08,388 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. పౌరులంతా గృహనిర్బంధంలో ఉండాలని ఆయా దేశాధ్యక్షులు ప్రకటన విడుదల చేశారు. యూరోపియన్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు యూరోపియన్ దేశాల్లో 10 వేలకు పైగా మృతి చెందారు. 1,95,000 మంది కరోనాతో బాధ పడుతున్నారు. ఇక అమెరికాలో రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హరిస్ పేర్కొన్నారు.
అత్యధికంగా ఇటలీలో 6,820 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 740 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీ తర్వాత చైనాలో 3,277 మంది మరణించగా, స్పెయిన్‌లో 2,991, ఇరాన్‌లో 1,934 మంది, ఫ్రాన్స్‌లో 1,100 మంది, అమెరికాలో 698 మంది, యూకేలో 422 మంది, నెదర్లాండ్స్‌లో 276 మంది, బెల్జియంలో 122 మంది, స్విట్జర్లాండ్‌లో 122 మంది, దక్షిణకొరియాలో 120 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు.
దాయాది దేశం పాకిస్తాన్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. పాక్ లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 959కి చేరుకోగా, మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అక్కడ అత్యధికంగా సింధూ ప్రావిన్స్ లో 410, పంజాబ్ ప్రావిన్స్ లో 267 కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు స్వదేశీ విమానాలను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)