Hydroxychloroquine: హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై వార్, అమెరికాకు ఎగుమతి చేయకుంటే ఫలితాలు వేరేగా ఉంటాయన్న ట్రంప్, ఎగుమతులపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని భారత్

భారత్ తీరుపై ట్రంప్ (Trump) కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ (India)తమకు పంపించనట్లయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని(వాణిజ్య పరంగా) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌తో తమకు సత్పంబంధాలు ఉన్నాయని... అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు.

File Image of US President Donald Trump. | (Photo-ANI)

Washington, April 7: హైడ్రాక్సీ క్లోరోక్విన్ (Hydroxychloroquine) మాత్రలు భారత్ - అమెరికాల (India-America) మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ (Trump) కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ (India)తమకు పంపించనట్లయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని(వాణిజ్య పరంగా) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌తో తమకు సత్పంబంధాలు ఉన్నాయని... అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు.

హైడ్రా​క్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ ఎగుమతి చేయాలని ఇండియాను కోరిన అమెరికా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (Coronavirus)మహమ్మారిని నిర్మూలించడంలో మలేరియా వ్యాధిని అరికట్టే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్ల వాడకం సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తున్న తరుణంలో తమకు వాటిని ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్‌ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో చర్చలు జరిపారు.

చైనాలో మళ్లీ కరోనా కలకలం

అయితే భారత్ మాత్రం దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్దమొత్తంలో అమెరికాకు ఎలా అందిస్తామని అంటోంది. దీనిపై త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ట్రంప్ మాత్రం భారత్ తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా?

కోవిడ్‌-19 అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ట్రంప్‌ సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులను భారత్‌ నిషేధించిన విషయం గురించి విలేకరులు ట్రంప్‌ ముందు ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. ‘‘ఇతర దేశాలకు మోదీ ప్రభుత్వం ఎగుమతులను(టాబ్లెట్లు) నిలిపివేసిందని తెలుసు. అయితే నేను ఆదివారం మోదీకి ఫోన్‌ చేశాను. మా సంభాషణ ఎంతో బాగా సాగింది.

మరింత క్షీణించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం

చాలా ఏళ్లుగా భారత్‌ వాణిజ్యపరంగా అమెరికా వల్ల అనేక ప్రయోజనాలు పొందింది. అలాంటి మాకు కూడా భారత్‌ ఆ మాత్రలు పంపకూడదు అనుకుంటే.. ఆ విషయం ముందే చెప్పాలి. ఒకవేళ అదే గనుక ఆయన నిర్ణయం అయితే.. మరేం పర్లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాం. కచ్చితంగా అందుకు కౌంటర్‌ ఇస్తాం’’ అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. అదే విధంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కరోనా గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన ట్రంప్‌.. కోవిడ్‌-19 బాధితులకు దాని అవసరం ఎంతగానో ఉందన్నారు.

మలేరియాకు మందుగా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని వాడుతున్నారు. వీటి ధర కూడా పెద్ద ఎక్కువేం కాదు. అయితే ఈ మందు కరోనాను తరిమికొట్టడంలో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పైనే ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఔషధం సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది. కాగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.

భారత్‌లోనూ ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా.. క్లోరోక్విన్‌ ఎగుమతుల్ని ఏప్రిల్‌ 4న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే అంతకుముందే అమెరికా ఈ మందుల కోసం ఆర్డర్‌ చేసింది. ఇక ప్రస్తుతం అమెరికాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఇప్పటికే అక్కడ 10 వేల మందికి పైగా మరణించగా కేవలం న్యూయార్క్‌లోనే 4,758 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉండేందుకు అమెరికా 2.9 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.