తాజా వార్తలు
Sex Assault Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ కోసం వెళ్ళిన మహిళకు లైంగిక వేధింపులు, అక్కడ టచ్ చేస్తూ దారుణం..
Team Latestlyబెంగళూరు శివార్లలోని అనేకల్ నుండి లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ప్లాస్మా మెడినోస్టిక్స్‌లో స్కాన్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్ట్ తన ప్రైవేట్ భాగాలను తాకాడని 34 ఏళ్ల మహిళ ఆరోపించిన తర్వాత ఈ షాకింగ్ లైంగిక వేధింపుల కేసు బయటపడింది.
AI Love Story in Japan: టెక్నాలజీ హద్దులు దాటింది, తన సొంత AI భాగస్వామిని వివాహం చేసుకున్న జపాన్ మహిళ, కృత్రిమ మేధస్సుతో పెళ్లి వీడియో వైరల్
Team Latestlyకృత్రిమ మేధస్సు (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, జపాన్‌కు చెందిన ఒక మహిళ తన AI వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల కానో అనే ఈ మహిళ తనకు ఎంతో సన్నిహితంగా మారిన ChatGPT ఆధారిత చాట్‌బాట్ వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రత్యేక వివాహ వేడుక జపాన్‌లోని ఒకాయమా నగరంలో ఈ వేసవిలో ఘనంగా జరిగింది.
Murder Attempt Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, హత్యాయత్నం కెమెరాలో రికార్డు, వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులు, కుమారుడికి గాయాలు
Team Latestlyబెంగళూరులోని న్యూ బీఈఎల్ రోడ్డుపై చోటుచేసుకున్న భయానక ఘటన నగరాన్ని కుదిపేసింది. వేగంగా వస్తున్న కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన ఘటనలో ఒక జంటవారి చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
Gujarat Blast: గుజరాత్లో భారీ పేలుడు, భరూచ్ జిల్లాలో ఔషధ కర్మాగారంలో బాయిలర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి, మరో 20 20 మందికి గాయాలు
Team Latestlyగుజరాత్లో భారీ పేలుడు సంభవించింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో బాయిలర్ పేలుడు, ఆ తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారని వార్తా సంస్థ PTI తెలిపింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ఒక ఔషధ కర్మాగారంలో ఈ సంఘటన జరిగింది. సయ్ఖా GIDC ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు.
Tamil Nadu: వీడియో ఇదిగో, కారు రన్నింగ్‌లో ఉండగా సైడ్ మిర్రర్ నుంచి పాము బయటకు, ఒక్కసారిగా షాక్ అయిన కారు డ్రైవర్
Team Latestlyతమిళనాడులో కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్ మిర్రర్ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది. ఇది గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుస్తూ కొంత దూరం వెళ్లాక కారు సైడ్ మిర్రర్ (car side mirror)లోపల నుంచి చిన్న పాము బయటకు వచ్చింది.
Nalgonda Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును వెనుక నుండి ఢీకొట్టిన లారీ, బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం
Team Latestlyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద సోమవారం శ్రీ విద్యాపీట్ బస్సును లారీ వెనుక నుండి ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
Delhi Blast: వీడియో ఇదిగో, ఢిల్లీలో బాంబు మోత, ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు, మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఘటన, పలువురికి గాయాలు
Team Latestlyదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఐదుకుపైగా వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి.
ISRO Chandrayaan 2: చంద్రయాన్-2 నుంచి కొత్త డేటా ఉత్పత్తి, చంద్రుడి ధ్రువ ప్రాంతాలపై మరింత లోతైన అధ్యయనం
Team Latestlyచంద్రుని ధ్రువ ప్రాంతాలపై మరింత లోతుగా అవగాహన పెంచే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ముందడుగు వేసింది. చంద్రయాన్-2 ఉపగ్రహం ద్వారా చంద్ర కక్ష్య నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడి అధునాతన డేటా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో.. బైక్ మీద వెళుతూ కుప్పకూలి పడిపోయిన వాహనదారుడు, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మృతి..
Team Latestlyగురువారం మధ్యాహ్నం ఇండోర్‌లోని దావా బజార్ సమీపంలో ప్రకాష్ కుమాయు కుమారుడు ధర్మేంద్రగా గుర్తించబడిన 32 ఏళ్ల మెడికల్ స్టోర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. లోహా మండి నివాసి అయిన ధర్మేంద్ర తన పనికి వెళుతుండగా అకస్మాత్తుగా బైక్ మీద నుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు, సహచరులు సహాయం కోసం పరుగెత్తారు.
Surat Horror: వీడియో ఇదిగో, వీధి కుక్కల నుండి తప్పించుకోబోయి రోడ్డుపై జారి పడిన 38 ఏళ్ల వ్యక్తి, తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి
Team Latestlyపెరుగుతున్న వీధికుక్కల బెడదను బహిర్గతం చేసే దిగ్భ్రాంతికరమైన సంఘటనలో.. సూరత్‌లోని భండారివాడ్, సయ్యద్‌పురా ప్రాంతంలో ఇబ్రహీం అలియాస్ ఎజాజ్ అహ్మద్ అన్సారీగా గుర్తించబడిన 38 ఏళ్ల వ్యక్తి వీధికుక్కల గుంపు వెంబడించిన కొన్ని రోజుల తర్వాత మరణించాడు. అక్టోబర్ 24న ఇబ్రహీం ఉదయం ప్రార్థనల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, వేగంగా వచ్చి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన వాహనదారుడు, దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు
Team Latestlyమధ్యప్రదేశ్‌లో ఒక కలకలం రేపే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఖాండ్వాలో వేగంగా వస్తున్న కారు ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నవంబర్ 6, గురువారం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి? హర్లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ
Team Latestlyమహిళల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.
Harish Rai Dies: ధైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందిన కేజీఎఫ్ మూవీ నటుడు, చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు ఖర్చు..చూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి..
Team Latestlyకన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. కొంతకాలంగా ధైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Team Latestlyఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.
Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు
Deoria Boat Capsize: వీడియో ఇదిగో, కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా విషాదం, సరయూ నదిలో పడవ బోల్తా, పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ గంగా ఘాట్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో నిండిన ఓ పడవ సరయూ నదిలో బోల్తా పడింది. సమాచారం ప్రకారం, ఆ పడవలో 12 మంది భక్తులు ఉన్నారు.
Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyనాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.
Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఛత్తీస్‌గఢ్ (Chattishgarh)లోని బిలాస్పూర్ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు
Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన
Team Latestlyహర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.