తాజా వార్తలు
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో.. బైక్ మీద వెళుతూ కుప్పకూలి పడిపోయిన వాహనదారుడు, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మృతి..
Team Latestlyగురువారం మధ్యాహ్నం ఇండోర్‌లోని దావా బజార్ సమీపంలో ప్రకాష్ కుమాయు కుమారుడు ధర్మేంద్రగా గుర్తించబడిన 32 ఏళ్ల మెడికల్ స్టోర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. లోహా మండి నివాసి అయిన ధర్మేంద్ర తన పనికి వెళుతుండగా అకస్మాత్తుగా బైక్ మీద నుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు, సహచరులు సహాయం కోసం పరుగెత్తారు.
Surat Horror: వీడియో ఇదిగో, వీధి కుక్కల నుండి తప్పించుకోబోయి రోడ్డుపై జారి పడిన 38 ఏళ్ల వ్యక్తి, తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి
Team Latestlyపెరుగుతున్న వీధికుక్కల బెడదను బహిర్గతం చేసే దిగ్భ్రాంతికరమైన సంఘటనలో.. సూరత్‌లోని భండారివాడ్, సయ్యద్‌పురా ప్రాంతంలో ఇబ్రహీం అలియాస్ ఎజాజ్ అహ్మద్ అన్సారీగా గుర్తించబడిన 38 ఏళ్ల వ్యక్తి వీధికుక్కల గుంపు వెంబడించిన కొన్ని రోజుల తర్వాత మరణించాడు. అక్టోబర్ 24న ఇబ్రహీం ఉదయం ప్రార్థనల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, వేగంగా వచ్చి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన వాహనదారుడు, దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు
Team Latestlyమధ్యప్రదేశ్‌లో ఒక కలకలం రేపే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఖాండ్వాలో వేగంగా వస్తున్న కారు ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నవంబర్ 6, గురువారం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి? హర్‌లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ
Team Latestlyమహిళల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.
Harish Rai Dies: ధైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందిన కేజీఎఫ్ మూవీ నటుడు, చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు ఖర్చు..చూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి..
Team Latestlyకన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. కొంతకాలంగా ధైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Team Latestlyఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.
Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు
Deoria Boat Capsize: వీడియో ఇదిగో, కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా విషాదం, సరయూ నదిలో పడవ బోల్తా, పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ గంగా ఘాట్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో నిండిన ఓ పడవ సరయూ నదిలో బోల్తా పడింది. సమాచారం ప్రకారం, ఆ పడవలో 12 మంది భక్తులు ఉన్నారు.
Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyనాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.
Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఛత్తీస్‌గఢ్ (Chattishgarh)లోని బిలాస్‌పూర్ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు
Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన
Team Latestlyహర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ
Team Latestlyఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.
Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు
Team Latestlyరాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Kasibugga Stampede: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట, తొమ్మదిమంది మృతి, మరికొందరికి గాయాలు, ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
Team Latestlyశ్రీకాకుళంలో(Srikakulam) జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో..మూడేళ్ల పాప పైకి దూసుకెళ్లిన కారు, అయినా కూడా దెబ్బలు తగలకుండా కారు కింద నుండి మెల్లిగా బయటకు..
Team Latestlyఅహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసిటివిలో రికార్డైంది. ఇందులో ఒక టీనేజర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, వేగంగా వస్తున్న నంబర్ ప్లేట్ లేని కారు ఆమెపైకి దూసుకెళ్లింది.
India Winning Moment Video: భారత మహిళల విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి..
Team Latestlyఅక్టోబర్ 31న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై గెలిచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులతో కిటకిటలాడిన స్టేడియంలో ఆ రాత్రి భారత జట్టు ఆట ఒక మాయాజాలం లా మారింది.భారీ స్కోరు ఛేజ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా భారత మహిళలు ధైర్యంగా పోరాడారు.
Ikkis Trailer Out: ఇక్కీస్ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ
Team Latestlyభారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.
Shreyas Iyer: గాయం తర్వాత మొదటిసారిగా స్పందించిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోలుకునే దశలో ఉన్నానని వెల్లడి, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ నోట్
Team Latestlyసిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు.
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం
Team Latestlyఅమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
Hurricane Melissa: కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్ మెలిస్సా, వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా నీటిలో మునిగిపోయిన కార్లు
Team Latestlyమంగళవారం, అక్టోబర్ 28న జమైకాలో తుఫాను మెలిస్సా తీరాన్ని తాకింది. తీరాన్ని తాకుతూనే విపత్కర గాలులు, కుండపోత వర్షం, భారీ తుఫానును తీసుకువచ్చింది. కేటగిరీ 5 హరికేన్ మాండెవిల్లే, బ్లాక్ రివర్, మాంటెగో బే వంటి ప్రదేశాలలో విధ్వంసం సృష్టించింది. చర్చి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి.