తాజా వార్తలు
Helmet Rule Violation: వైరల్ వీడియో ఇదిగో, హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన ట్రాఫిక్ పోలీసుకు షాక్, కుర్రాడి దెబ్బకు రూ.2 వేల ఫైన్ విధించిన అధికారులు
Team Latestlyథానేలో చోటుచేసుకున్న వైరల్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం చేస్తూ కనిపించాడు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తికి గతంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించబడింది, దానిపట్ల అతనికి పగ పెరిగి, మళ్లీ అదే అధికారిని ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు
Team Latestlyహైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్‌కు చెందిన 31 ఏళ్ల మణిదీప్‌గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.
Air India Bus Fire in Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఎయిర్ ఇండియా విమానం సమీపంలోని బస్సుకు అంటుకున్న నిప్పు, వీడియో ఇదిగో..
Team Latestlyఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ఇండియా విమానం సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కాసేపు ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చెలరేగింది.
Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టులతో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
Team Latestlyకెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజర్వ్ ఫారెస్టుకు టూరిస్టులతో వెళ్తున్న విమానం కూలడంతో 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కొండలు, అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..
Team Latestlyటర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.
Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Team Latestlyకరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.
Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
Team Latestlyకర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్‌లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన
Team Latestlyదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లోని ఇంటర్‌ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం
Team Latestlyకర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు, నవంబర్ 14న ఫలితాలు
Team Latestlyబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్ గెహ్లాట్ ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
Murder Caught on Camera: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య, డ్రైవర్ ని ఇటుకలతో కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Team Latestlyయూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని ధూమంగంజ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన దాడి చోటు చేసుకుంది. కాంట్రాక్టు రోడ్‌వేస్ డ్రైవర్ రవెంద్ర కుమార్ అలియాస్ మున్ను అనే వ్యక్తి తలపై ఇద్దరు వ్యక్తులు ఇటుకలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన అక్టోబర్ 21న CCTVలో రికార్డైంది. బాధితుడు వారు విసిరేసిన ఇటుకలు, రాళ్లను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన
Team Latestlyఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.
Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..
Team Latestlyకాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.
Droupadi Murmu Helipad Mishap in Kerala: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం, ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్, వీడియో ఇదిగో..
Team Latestlyకేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్‌లో అనుకోని సమస్యల కారణంగా కొంచెం కుంగి, ఒక పక్కకు ఒరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tirumala Rain Alert: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, వీడియో ఇదిగో..
Team Latestlyతిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడుగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది.
Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచి, పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ- జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో భారీ మద్ధతు
Team Latestlyజపాన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సనై టకైచి దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఉన్న తకైచి, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పదవీ విరమణ చేసిన షిగెరు ఇషిబాకు తరువాత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
Bengaluru: వీడియో ఇదిగో, నాకే ఎదురు చెబుతావా అంటూ.. ప్రయాణికుడిని పదేపదే చెంప దెబ్బలు కొట్టిన ట్రాఫిక్ పోలీసు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Team Latestlyభారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ దగ్గర తప్పుడు మార్గంలో వాహనం నడిపినందుకు బైకర్‌ను ఆపేసిన ఒక ట్రాఫిక్ పోలీసు అతడిని పదేపదే చెంపదెబ్బ కొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ ఫుటేజ్‌లో ఆ రైడర్ ట్రాఫిక్ పోలీసుతో వాదులాడుతుండగా.. ఇతర అధికారులు పరిస్థితిని శాంతింపజేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది
PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
Team Latestlyఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.
Diwali 2025: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, బాణాసంచా అమ్మకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి
Team Latestlyదీపావళి రాకముందే దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్‌సీఆర్‌లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అధికారులను ఆదేశించింది.