తాజా వార్తలు
Hyderabad: వీడియో ఇదిగో, తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని చెప్పినందుకు దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు
Team Latestlyకూకట్‌పల్లిలోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లోని ఒక నివాస ప్రాంతంలో తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని కోరిన దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. దాడికి ముందు దంపతులు హాస్టల్ విద్యార్థులను మా ఇంటి ముందు బైక్ పార్క్ చేయొద్దని అడిగారు. అయితే వారిలో కొంతమంది స్పందించకపోవడంతో తలెత్తిన విరోధం దాడి రూపానికి చేరింది
Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..
Team Latestlyఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan Bus Fire: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం, నేషనల్ హైవేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, 15 మంది సజీవ దహనం అయినట్లుగా వార్తలు
Team Latestlyరాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, బైకుపై వెళుతూ రైలు పట్టాలు క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి, రైలు దూసుకురావడంతో దాని కింద పడి నుజ్జు నుజ్జు, నోయిడాలో ఘటన
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించి అది బెడిసికొట్టడంతో రైలు కింద పడి మృతి చెందాడు.
Girl Slaps Boy: వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..
Team Latestlyభారతదేశంలో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఆసక్తికర సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంటాయి., చాలా సార్లు, ప్రసారకుల కెమెరా గ్యాలరీలో చిరస్మరణీయ క్షణాలను రికార్డు అవుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా vs వెస్టిండీస్ రెండవ టెస్ట్ డే 4లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరదాగా చెంపదెబ్బ కొట్టడం కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Cow Capture Gone Wrong in Vadodara: వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు
Team Latestlyగుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Madhya Pradesh Horror: మృతదేహాన్ని కూడా వదలని కామాంధుడు, మార్చురీలోనే మహిళ మృతదేహంపై లైంగిక దాడి, నిందితుడు అరెస్ట్
Team Latestlyమధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పోస్ట్‌మార్టం కోసం ఉంచిన మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించిన దృశ్యం సీసీటీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఏప్రిల్ 18, 2024న చోటుచేసుకుంది. అయితే, సీసీటీవీ ఫుటేజ్ అక్టోబర్ 7, 2025న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మాత్రమే ప్రజలకు తెలిసింది.
Telangana Local Body Elections: తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు
Team Latestlyతెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.
Kanpur Scooty Blast: సిసిటివి వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా షాపులో భారీ పేలుడు, 8 మందికి తీవ్ర గాయాలు
Team Latestlyకాన్పూర్‌లోని మూల్‌గంజ్ ప్రాంతంలోని మిశ్రీ బజార్‌లోని ఒక దుకాణంలో బుధవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది గాయపడ్డారు. సాయంత్రం 6:50 గంటలకు దుకాణం వెలుపల పేర్చిన కార్టన్‌ల కింద నుండి పేలుడు సంభవించినట్లు సిసిటివి ఫుటేజ్‌లో కనిపిస్తోంది.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఆస్పత్రికి వెళ్లేలోపే తిరిగిరాని లోకాలకు..
Team Latestlyఅక్టోబర్ 6, సోమవారం ఉదయం తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. తక్షణ సహాయం అందించినా ఆ అధికారిని తిరిగి బ్రతికించలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన CCTV వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gaza Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ
Team Latestlyగత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.
‘Show Your Ticket Or Get Out’: వీడియో ఇదిగో, రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రభుత్వ టీచర్, అడిగినందుకు టీటీపై బూతులతో దాడి
Team Latestlyరైల్వే నియమాల అమలును బేఖాతరు చేస్తూ బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒకరు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. రైలు టికెట్ కలెక్టర్ (TT) తన విధిని నిర్వర్తిస్తూ, ఆమెను ఎదుర్కొని, “అగర్ టికెట్ హై తో షో కిజియే నా మేడం (మీ దగ్గర టికెట్ ఉంటే, దయచేసి నాకు చూపించండి, మేడమ్)” అని అన్నాడు.
‘War 2’ OTT Release Date: అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో వార్ 2 స్ట్రీమింగ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి..
Team Latestlyవార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో భారత వ్యాపారిని గన్‌తో తలపై కాల్చి చంపిన దుండగుడు
Team Latestlyఅమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.
Nobel Prize in Physics 2025 Winners: ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి, ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు అవార్డు
Team Latestlyఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. దేవరేట్, జాన్ ఎం. మార్టినిస్‌లకు సంయుక్తంగా అవార్డు ప్రకటించబడింది. వారు ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు పొందారు.
Crocodile Drags Woman Into River: వీడియో ఇదిగో, నదిలో బట్టలు ఉతుక్కుంటున్న మహిళను లాక్కెళ్లిన మొసలి, ఎంత భయంకరంగా ఉందంటే..
Team Latestlyఒడిశాలో ఖరాస్రోటా నదీ తీరం వద్ద శనివారం ఒక భయంకర సంఘటన వెలుగుచూసింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో, నదీ తీరానికి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన 55 ఏళ్ల సౌదామినీ మహాలా అనే మహిళపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. మహిళను నోట కరిచి, ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ దారుణం స్థానికులను షాక్‌కి గురిచేసింది.
Bihar Assembly Elections 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, రెండు దశల్లో పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు, మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు
Team Latestlyబీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశంలో, నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.
Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న ఇద్దరు వ్యక్తులు, బిత్తరపోయి చూస్తుండిపోయిన ఇతర ప్రయాణికులు
Team Latestlyఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు ఘోరంగా తన్నుకున్న వీడియో వైరల్ అవుతోంది. అనుచిత మాటలతో ఇద్దరూ ఘర్షణ పడిన వీడియో కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన 23 సెకన్ల వీడియోను ఘర్ కే కలేష్ అనే వ్యక్తి X (మునుపటి ట్విట్టర్) లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.
Khandwa Tragedy: దుర్గామాత నిమజ్జనం కోసం వెళుతుండగా చంబాల్ నదిలో పడిపోయిన ట్రాక్టర్, ఊపిరాడక 16 మంది మృతి, వీడియో ఇదిగో..
Team Latestlyమధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జన వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంబాల్ నదిలో దుర్గామాత నిమజ్జనం కోసం భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు.