తాజా వార్తలు
Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది, అవనీ లేఖా, మోనా అగర్వాల్‌లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రదాని మోదీ
Hazarath Reddyపారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లలో పతకాలు సాధించిన పారా అథ్లెట్లు అవనీ లేఖా, మోనా అగర్వాల్ లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలియజేసేందుకు X, (ట్విట్టర్) లోకి వెళ్లారు.
Gurukul School Students Protest: పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyరంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు.
‘Actions Have Consequences’: పాకిస్తాన్‌తో యుద్దం తప్ప ఇకపై చర్చలు ఉండవు, కీలక వ్యాఖ్యలు చేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఉగ్ర చర్యలకు తగిన పరిణామాలుంటాయని హెచ్చరిక
Hazarath Reddyదాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు
Paris Paralympics 2024 Shooting: పారిస్ పారాలింపిక్స్ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్
Hazarath Reddyపారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్ రెండు పతకాలతో మెరిసింది.
Robert Vadra At Hyderabad: హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా, ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించిన వాద్రా
Arun Charagondaకాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు వాద్రా. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు వాద్రా. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు.
Avani Lekhara Wins Gold: పారిస్ పారాలింపిక్స్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్
Hazarath Reddyపారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల సంఖ్య మొదలయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్యంతో ముగియగా, అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌కు ప్రస్తుతం రెండు పతకాలు ఉన్నాయి.
V. Vijayasai Reddy: నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం
Arun Charagondaరానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు
Hazarath Reddyనల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Allahabad High Court: భర్తను భార్య రూంలోకి రానివ్వకుండా వేరే రూంలో పడుకోమనడం క్రూరత్వమే, కేసులో భర్తకు విడాకులు మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyభర్తతో కాపురం చేయడానికి భార్య నిరాకరించి, అతడిని ప్రత్యేక గదిలో నివసించమని బలవంతం చేస్తే, ఆమె అతని వైవాహిక హక్కులను హరించివేస్తుందని, అదే క్రూరత్వానికి సమానమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు
Hazarath Reddyప్రతాప్‌గఢ్‌లోని చిల్‌బిలా కూడలిలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో తాగిన వ్యక్తి కుర్చీపై కూర్చొని, ట్రక్కు ఢీకొనడంతో తృటిలో తప్పించుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ట్రక్.. కుర్చీని ఢీకొన్న క్షణాన్ని క్లిప్ సంగ్రహిస్తుంది, అయితే తాగుబోతును ఢీకొట్టిన తరువాత ప్రమాదాన్ని పట్టించుకోకుండా లారీ వెళ్లిపోయింది
UK Horror: యూకేలో దారుణం, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికను 17 సార్లు కత్తితో పొడిచిన బాలుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనవరి 27, 2023న 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని హోలీ న్యూటన్‌ను కత్తితో పొడిచి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని న్యూకాజిల్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన UKలోని హెక్సామ్, నార్తంబర్‌ల్యాండ్‌లో జరిగింది. దాడి జరిగిన రోజున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన పాఠశాల అయిన క్వీన్ ఎలిజబెత్ హైస్కూల్‌ను విడిచిపెట్టిన తర్వాత నిందితుడు హోలీ న్యూటన్‌ను వెంబడించారు.
Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి
Hazarath Reddyఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్ అన్‌స్టాపబుల్..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు
Arun Charagondaబాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
Hazarath Reddyవైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు
Arun Charagondaపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.
CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి
Arun Charagondaదేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
YSRCP MLCs Resign: వైసీపీకి మరో షాక్, పార్టీకి - ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు!
Arun Charagondaవైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి.
Jurala Project: రికార్డు స్థాయిలో జురాలకు పోటెత్తిన వరద, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతున్న వరదనీరు..వీడియో
Arun Charagondaఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి,నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతోంది వరద నీరు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,10,000 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు ఓట్ ఫ్లో: 3,00,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీంఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.010 టీఎంసీలుగా ఉంది.
Andhra Pradesh: సీఎం చంద్రబాబు మరో సంచలనం, ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్‌ఆర్ పేరును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.