India

Boat Capsized Video: ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ముంబై పోలీసులు మరియు ఇండియన్ నేవీ ద్వారా ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గేట్‌వే నుంచి ముంబై సమీపంలోని ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ మునిగిపోయింది.

Puneet Superstar Slapped: విమానం దిగుతుండగా పునీత్ సూపర్‌స్టార్‌‌ని చితకబాదిన యువకుడు, ఇదంతా స్క్రిప్ట్ అంటూ నెటిజన్లు సెటైర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బిగ్ బాస్ OTT సీజన్ 2 కంటెస్టెంట్ పునీత్ సూపర్‌స్టార్ ని ఓ వ్యక్తి చితకబాదుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఘర్ కా కాలేష్ (వాస్తవానికి అర్హంత్ షెల్బీ అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది) అనే ప్రముఖ పేజీ తర్వాత X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో ఒక వీడియో వైరల్ అయింది ,

Prabhas Spoke in Japanese: వీడియో ఇదిగో, జపనీస్‌లో మాట్లాడిన డార్లింగ్ ప్రభాస్, షూటింగ్లో నా కాలు బెణికింది అందుకే జపాన్ రాలేకపోతున్నానంటూ సందేశం

Hazarath Reddy

Andhra Pradesh: వీడియో ఇదిగో, బ్యాంకులో క్యాషియర్ మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించిన దొంగ

Hazarath Reddy

బ్యాంకు ఉద్యోగి మెడ పై కత్తి పెట్టి బెదిరించిన దొంగ...తిరపతి రూరల్ మండలం రేణిగుంట రోడ్డులోని బ్యాంకులోకి దొంగ కత్తితో చొరబడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించాడు.

Advertisement

Telangana: దారుణం, 8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్, ఒంటిపై నూనె పడటంతో తీవ్ర గాయాలు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రుల డిమాండ్

Hazarath Reddy

భువనగిరి - నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించాడు ప్రిన్సిపాల్. అయితే వంట చేస్తుండగా విద్యార్థి ఒంటిపై నూనె పడి తీవ్ర గాయాలు అయ్యాయి

Telugu YouTuber Prasad Behara Arrest: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌ర‌ అరెస్ట్, షూటింగ్‌ సమయంలో త‌న‌ ప్రైవేట్‌ భాగాలను తాకాడని యువతి ఫిర్యాదు

Hazarath Reddy

ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌ర‌ను లైంగిక వేధింపుల కేసులో హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. త‌న సహచర న‌టిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Mumbai Hit and Run: షాకింగ్ వీడియో, రోడ్డు దాటుతున్న 78 ఏళ్ల వృద్ధుడిని డీకొట్టిన బైక్, ఎగిరి రోడ్డు అవతల పడటంతో తీవ్ర గాయాలు

Hazarath Reddy

ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని సహర్ రోడ్‌లో రోడ్డు దాటుతున్న 78 ఏళ్ల వ్యక్తిని వేగంగా వచ్చిన మోటార్‌సైకిలిస్ట్ ఢీకొట్టడంతో హిట్ అండ్ రన్ సంఘటన జరిగింది. ఢీకొన్న వెంటనే గుర్తు తెలియని రైడర్ అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకుని వృద్ధుడికి సాయం చేశారు

Telangana: నల్గొండలో ప్రిన్సిపాల్ అమానుషం, విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా కొట్టిన ప్రిన్సిపాల్...ఎందుకో తెలిస్తే షాకవుతారు

Arun Charagonda

నల్గొండ - వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావ తాగుతుండగా ప్రిన్సిపల్ జావ ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మణికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ, పాదచారుల భద్రత ముఖ్యమని వెల్లడి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.

New Year 2025 Travel plans: నూతన సంవత్సరం 2025 వేడుకలను సముద్ర బీచ్ లో జరుపుకోవాలని అనుకుంటున్నారా..అయితే ఏపీలో టాప్ బీచ్ స్పాట్స్ ఇవే..

sajaya

కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే డిసెంబర్ 31వ తేదీ వేడుకల కోసం మీరు చక్కటి బీచ్ కి వెళ్లి సంబరాలు జరుపుకోవాలి. అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు బీచ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. .

Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే

Arun Charagonda

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల విక్రయం ద్వారా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.14,131.6 కోట్లు తిరిగి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.

Advertisement

Mobile Subscriptions in India: దేశంలో 115.12 కోట్లకు చేరుకున్న మొబైల్ సబ్‌స్కైబర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని

Hazarath Reddy

దేశంలోని 6,44,131 గ్రామాలలో, 6,23,622 గ్రామాలకు ఇప్పుడు మొబైల్ కవరేజీ ఉందని సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్

Arun Charagonda

ఆదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.

Mumbai Shocker: వీడియో ఇదిగో, ముంబైలో మహిళా కంపార్ట్ మెంట్‌ రైలులోకి నగ్నంగా ఎక్కేసిన పురుషుడు, ఒక్కసారిగా చూసి కెవ్వున అరిచిన మహిళలు

Hazarath Reddy

డిసెంబర్ 16న CSMT-కళ్యాణ్ ఫాస్ట్ AC లోకల్ ట్రైన్‌లో ఘట్‌కోపర్ స్టేషన్‌లోని లేడీస్ కోచ్‌లోకి నగ్నంగా ఒక వ్యక్తి ప్రవేశించడంతో ఆందోళన కలిగించే సంఘటన మహిళా ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. సాయంత్రం 4:11 గంటల ప్రాంతంలో రైలు ఘట్‌కోపర్ స్టేషన్‌కు చేరుకోగా, ఆ వ్యక్తి నగ్నంగా మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు.

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు

Advertisement

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Hazarath Reddy

అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Astrology: డిసెంబర్ 25 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో సూర్య గ్రహానికి రాజుగా చెప్తారు. సూర్యుని రాశి మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి ప్రభావితం అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Elon Musk: 500 బిలియన్ డాలర్లకు చేరిన ఎలాన్ మస్క్ ఆదాయం, ట్రంప్ విజయం తర్వాత రోజురోజుకు పెరుగుతున్న మస్క్ సంపాదన...ఏకంగా 107 శాతం పెరిగిన వైనం

Arun Charagonda

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత మస్క్ సంపాదన రోజురోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజుల క్రితం 439.2 బిలియన్ డాలర్లకు పెరిగిన మస్క్ సంపాదన తాజాగా 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క వారంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరుగగా మొత్తంగా ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 107శాతానికి పైగా పెరిగింది.

Advertisement
Advertisement