India
Telangana Freebies Row: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన.. ఉచిత పథకాలతో తీవ్ర ప్రమాదకర పరిస్థితులు.. ఇలాగే కొనసాగితే దివాళా తీయడం తప్పదని కీలక వ్యాఖ్యలు..
Team Latestlyతెలంగాణలో పరిమితి లేకుండా అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలు, వాటి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో.. త్వరలోనే తీవ్ర ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.
Weather Alert: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు హెచ్చరిక.. డాల్ఫిన్ టైఫూన్ దెబ్బకు చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
Team Latestlyబంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తుఫాను ఆవర్తనం (Cyclonic Circulation) కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తూర్పు, మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవన కార్యకలాపాలు చురుకుగా మారే అవకాశం ఉంది.
AI Virus Research: ఏఐతో కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి..
Team Latestlyకృత్రిమ మేధ (Artificial Intelligence) జీవసంబంధ పరిశోధనల్లో వేగంగా వినియోగంలోకి వస్తోంది. ఔషధాల అభివృద్ధి, వ్యాక్సిన్ పరిశోధనలు, వ్యాధుల విశ్లేషణ వంటి రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అదే సాంకేతికతను కొత్త వైరస్ల రూపకల్పనకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనలను బయోసెక్యూరిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
రేపటి వాతావరణం: కరీంనగర్ వాతావరణ సూచన..రేపు తేలికపాటి నుంచి మోస్తరు తుంపరలు.. ప్రజలకు కీలక సూచన
Team Latestlyకరీంనగర్ కోసం రేపటి, 08 ఆగస్టు 2026, శనివారం, వాతావరణ సూచన. రోజులో గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా ఉంటుంది. 61% వర్షం కురిసే అవకాశం ఉంది, మధ్యాహ్నం వేళల్లో తేలికపాటి తుంపరలు అంచనా వేయబడ్డాయి.
నేటి వాతావరణం : నెల్లూరు వాతావరణ సూచన.. నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Team Latestlyఆగష్టు 7, 2026, శుక్రవారం నాడు నెల్లూరులో వాతావరణం మేఘావృతమై ఉంటుంది, గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C కి చేరుకుంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన. తేమ శాతం 56%గా నమోదవుతుంది.
Will Jacks' Catch Video: విల్ జాక్స్ సూపర్‌మ్యాన్ క్యాచ్..చూస్తే వావ్ అనాల్సిందే.. లండన్ స్పిరిట్‌కు భారీ షాకిచ్చిన MI లండన్
Team Latestlyది హండ్రెడ్ 2026లో MI లండన్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విల్ జాక్స్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌తో లూహాన్-డ్రే ప్రిటోరియస్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ MI లండన్ వైపు మలుపు తిరిగింది. ఆగస్టు 6, 2026న లార్డ్స్‌లో జరిగిన ఈ 23వ మ్యాచ్‌లో MI లండన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.
CRPF: గతేడాది 59 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్య.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఎక్కువ బలవన్మరణాలు..
Team Latestlyసుమారు 3.25 లక్షల మంది సిబ్బంది కలిగిన సీఆర్పీఎఫ్లో ఏ క్షణంలోనైనా 95 నుండి 97 శాతం మంది నిరంతరం తీవ్రవాదుల ఏరివేత, చొరబాట్ల నిరోధం, ఎడతెగని శాంతిభద్రతల పరిరక్షణ వంటి సవాలుతో కూడిన విధుల్లో నిమగ్నమవుతుంటారు. విశ్లేషణ ప్రకారం అత్యధిక శాతం కేసుల్లో కుటుంబ సమస్యలు, భూతగాదాలు, సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండటం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
UPI Charges: రూ.2,000 పైబడిన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు.. UPI పేమెంట్ల కొత్త నిబంధనలపై పార్లమెంట్లో కీలక సవరణ బిల్లు...
Team Latestlyతెల్లారితే పాల ప్యాకెట్ కొనుగోలు చేయడం మొదలుకొని రాత్రి డిన్నర్ వరకూ ఒక్క రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు నిత్యం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి యాప్స్ ద్వారా ఉచితంగా సాగిస్తున్న యూపీఐ (UPI) లావాదేవీలపై ఇకపై రుసుముల భారం పడనుంది.
Pallaburusu Trailer Released: పళ్లబురుసు ట్రైలర్ ఇదిగో.. తండ్రి కొడుకుల మధ్య 'పళ్లబురుసు' పంచాయితీ: ఆకట్టుకుంటున్న అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త చిత్రం ట్రైలర్!
Team Latestly‘లెనిన్’ సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపుదిద్దుకున్న మరో ఆసక్తికర చిత్రం ‘పళ్లబురుసు’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
AP Weather Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Team Latestlyఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.
Horoscope Today: రాశిఫలాలు 07 ఆగస్టు 2026.. ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది.. మేషం నుంచి మీనం వరకు పూర్తి జాతకం
Team Latestly2026 ఆగస్టు 7, శుక్రవారం నాడు గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారిపై భిన్నమైన ప్రభావాలు కనిపించనున్నాయి. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉండగా, మరికొందరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం, ప్రేమ, విద్య, ప్రయాణాలకు సంబంధించి ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు ఉన్నాయి
Weather Update: హైదరాబాద్‌లో మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
Team Latestlyరానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Jhansi Road Accident: వీడియో ఇదిగో.. ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మాఫియా డాన్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి
Team Latestlyఉమేష్ పాల్ హత్య కేసుతో పాటు 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లను 2023 ఏప్రిల్‌లో పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు లైవ్ టీవీ కెమెరాల ముందే కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ముగిసిన దాదాపు మూడేళ్ల తర్వాత.. ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Hyderabad Voter List: హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు మిస్సింగ్.. ఆచూకి తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు.. ఒక్క జూబ్లీహిల్స్లోనే 88,933 మంది ఓటర్లు గల్లంతు..
Team Latestlyహైదరాబాద్ నగరంలోని ఓటర్ల జాబితాలో 10 లక్షలకు పైగా పేర్లు కనిపించడం లేదన్న ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ ఆరోపణల మధ్య, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నమోదు ఫారాలు సమర్పించని వారి పేర్లు ముసాయిదా జాబితాలో లేకపోవచ్చని, అర్హులైన వారు ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
IND-W vs SA-W 2026: భారత్ మహిళల దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్లో మార్పులు.. అదనంగా 3 T20 మ్యాచ్‌లు
Team LatestlyIND-W vs SA-W 2026 క్రికెట్ సిరీస్ కోసం పూర్తి హెడ్-టు-హెడ్ విశ్లేషణ, పునరుద్ధరించిన షెడ్యూల్, టీమ్ ఫామ్ మరియు కీలక ఆటగాళ్లతో కూడిన సమాచారం. డిసెంబర్ 9 నుండి 30 వరకు దక్షిణాఫ్రికాలో జరగనున్న ఈ పర్యటనలో ఒక టెస్ట్, మూడు ODIలు మరియు మూడు T20Iలు ఉంటాయి. అధికారిక ప్రసార వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.
రేపటి వాతావరణం : విజయవాడ వాతావరణం సూచన.. తేలికపాటి జల్లులతో ఆహ్లాదకర వాతావరణం
Team Latestlyవిజయవాడలో 07, ఆగస్టు 2026, శుక్రవారం నాడు తేలికపాటి జల్లులతో కూడిన వాతావరణం అంచనా. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 77% ఉంది, కాబట్టి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నేటి వాతావరణం : వరంగల్ వాతావరణ సూచన.. ఉరుములతో కూడిన చిరుజల్లుల అవకాశం.. బయటకు వెళ్లేవారు గొడుగు వెంట తీసుకెళ్లండి
Team Latestly06, ఆగస్టు 2026, గురువారం వరంగల్ లో తేలికపాటి తుంపరతో కూడిన వాతావరణం ఆశించబడుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, అనుభూత ఉష్ణోగ్రత 35°C మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా ఉంటుంది. 66% తేమతో, గాలి వేగం గంటకు 12 కిలోమీటర్లు ఉంటుంది. రోజులో పలు సమయాల్లో, ముఖ్యంగా తెల్లవారుజామున, వర్ష సూచన ఎక్కువగా ఉంది.
Total Solar Eclipse 2026: సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో కనిపిస్తుందా.. ఆ రోజు అసలు ఏం జరుగుతుంది..
Team Latestly2026 ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఎదురుచూస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవించనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో కొద్ది నిమిషాల పాటు పగటిపూట చీకటి అలుముకుంటుంది. ఈ సంపూర్ణ గ్రహణం ప్రధానంగా గ్రీన్‌ల్యాండ్, ఐస్లాండ్, స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించనుంది.
Telangana: మీ జీవితం చాలా విలువైనది.. తొందరపడవద్దు.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి సీపీ సజ్జనార్ కీలక సూచన.. సీఏ సూసైడ్ చాలా బాధాకరమని ఆవేదన..
Team Latestly33 ఏళ్ల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ వంటి అత్యున్నత అర్హత సాధించిన యువకుడు ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో గెలుపు అనేది కేవలం భ్రమ మాత్రమేనని.. క్షణిక వినోదం కోసం కష్టార్జిత సంపాదనను, భవిష్యత్తును పణంగా పెట్టవద్దని యువతకు సూచించారు.