India
Sharmila: జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని..అన్నగా ఏం చేశాడో చెప్పాలన్న వైఎస్ షర్మిల
Arun Charagondaజగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని అన్నారు టీపీసీసీ చీఫ్ షర్మిల. నేనేం తక్కువ చేసా.. నేనేం తప్పు చేసా.. ఒక్కటైనా చెప్పండి అని సవాల్ విసిరారు. ఇన్ని చేసిన నాకు జగన్ ఒక్క మేలు అయినా చేశారా అన్నారు.
India vs New Zealand 2nd Test: రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
Arun Charagondaభారత్‌తో జరిగిన మూడు టెస్టులో సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుపొందింది న్యూజిలాండ్. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. 359 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్ (77) పరుగులతో రాణించగా జడేజా (42) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లు తీశాడు.
Delhi BJP President: యమునా నదిలో స్నానం.. ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్,ఊపిరి- స్కిన్ సమస్యలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaయమునా నదిలో స్నానం.. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్. యమునా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నిధుల్లో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ.. నిరసనగా రెండు రోజుల క్రితం ఐటీవో ఘాట్ వద్ద నదిలో స్నానం చేశారు. అనంతరం ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, స్కిన్ అలర్జీస్ రావడంతో RML నర్సింగ్ ఆస్పత్రిలో చేరారు.
KTR: కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్ అని మండిపడ్డ కేటీఆర్, రైతులు ఆగమైతుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా అని మండిపాటు
Arun Charagondaఎక్స్ వేదికగా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది కాంగ్రెస్ సర్కారు అని మండిపడ్డారు. తెల్ల బంగారం తెల్లబోతుంది...బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు అన్నారు.
Telangana: రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్‌ఐ, భూ వివాదం నేపథ్యంలో అందరి ముందు కొట్టిన పోలీస్...ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
Arun Charagondaమునుగోడులో రైతును చితకబాదాడు ఓ ఏఎస్ఐ. ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుండగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పొలం పనులు ముగించుకుని వస్తానని ప్రాధేయపడ్డారు రైతు ముత్యాలు. అందరి ముందు రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్.
Srikanth Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి జైలు శిక్ష, శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష...మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలింపు
Arun Charagondaమాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌కి జైలు శిక్ష పడింది. మహబూబ్ నగర్ లో సర్వే నెంబర్ 523 అక్రమాల్లో ఏ4 నిందితుడిగా ఉన్నారు శ్రీకాంత్ గౌడ్. సాక్ష్యాలను పరిశీలించి శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు శ్రీకాంత్ గౌడ్‌ను తరలించారు.
Astrology: నవంబర్ 2 న సూర్యుడు స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు. సూర్యగ్రహం నవంబర్ రెండవ తేదీ స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అన్ని రాశులు వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
Health Tips: కిడ్నీలో రాళ్లు రావడానికి ఈ ఆహార పదార్థాలే కారణం..వీటిని దూరం చేస్తే మంచిది..
sajayaచాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది మన ఆహార పదార్థాల అలవాట్లు ,అనేక రకాల చెడు అలవాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది.
Health Tips: నాన్ వెజ్ మానేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, బిపి సమస్యలతో ఉన్నవారు వారి డైట్లో నాన్ వెజ్ ఆహారంని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Andhra Pradesh:మారమ్మ ఆలయంలో కత్తితో వ్యక్తి హల్‌చల్, రైల్వే పోలీసుల నుండి తప్పించుకుని ఆలయంలోకి చొరబాటు, పోలీసులకు అప్పగించిన స్థానికులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి వెళ్లి కత్తితో హల్ చల్ చేశాడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు నందలూరు పోలీసులు.
Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో బ్రహ్మీ ఆకులను తింటే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా చదువుల విషయంలో వారు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీన్ని తగ్గించడం కోసం ఉదయాన్నే బ్రహ్మీ ఆకులను నమలడం ద్వారా మీ మెదడు చాలా పదునుగా మారుతుంది.
Health Tips: చీజ్ అతిగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా..
sajayaచీజ్ లో క్యాల్షియం అధికంగా ఉన్నప్పటికీ అయితే అధికంగా చీజ్ తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చీజ్ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Madhu Yashki: ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రేమ లేదన్న మధుయాష్కి గౌడ్..కాంగ్రెస్ నాయకుల హత్య బాధాకరం అని మండిపాటు
Arun Charagondaపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై ప్రేమతో పార్టీ మారడం లేదని దుయ్యబట్టారు. అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు.
Telangana: నాగార్జునసాగర్ హైవేపై పోలీసులకు - బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మధ్య తోపులాట..భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, బ్రిటిష్ కాలం నాటి విధానాలను మార్చాలని డిమాండ్
Arun Charagondaరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, పోలీసులకు స్థానిక మధ్య తోపులాట జరిగింది. మహేశ్వరం డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఒక్క సరిగా ఉదృతంగా మారింది బాధితుల ఆందోళన. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి
Arun Charagondaఅమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
TDP Membership Drive: రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం..5లక్షల ప్రమాద బీమా, రూ. లక్షతో టీడీపీ జీవితకాల సభ్యత్వం...వివరాలివే
Arun Charagondaటీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుండి ప్రారంభంకానుంది. సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది.
Shamirpet Road Accident: శామీర్‌పేటలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ శామీర్‌పేటలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. బాధితులు కరీంనగర్ జిల్లా కార్ఖానా గడ్డకు చెందిన షేక్ సక్లిన్, అతని స్నేహితుడు మహమ్మద్ పుర్కన్. ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుంచి మెహిదీపట్నంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: నకిలీ బంగారం దందా గుట్టు రట్టు,రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 10 మంది అరెస్టు
Arun Charagondaరెండు ముఠాల మధ్య తుపాకీ కాల్పుల మిస్టరీని చేధించారు సత్యసాయి జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. 10 మందిని అరెస్టు చేశారు.
Vemulawada: రోడ్డు పక్కన కుప్పలుగా కోతుల కళేబరాలు, వేములవాడ పట్టణ శివారులో రోడ్డుపై మృతదేహాలు...దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaవేములవాడలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్నాయి కోతుల కళేబరాలు. వేములవాడ పట్టణ శివారులో రోడ్డు పక్కన పదుల సంఖ్యలో కోతులు మృతిచెందగా గుర్తుతెలియని వ్యక్తులు చంపి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Israel Strikes On Iran: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులు...వీడియో
Arun Charagondaఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుక పడింది ఇజ్రాయెల్. ఇవాళ తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీపంలోని నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు చేసింది. ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.