Information
Rajeev Kumar is New EC: ఈసీకి కొత్త బాస్, కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం, రాజీనామా చేసిన అశోక్‌ లావాసా స్థానంలోకి ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి
Hazarath Reddyకేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ (Rajeev Kumar is New EC) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన అశోక్‌ లావాసా (Ashok Lavasa) స్థానంలో రాజీవ్‌ కుమార్‌ నియామకం జరిగింది. సెప్టెంబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు (Rajiv Kumar takes over as new EC) స్వీకరించారు. రాజీవ్‌ కుమార్‌ జార్ఖండ్‌ కేడర్‌ 1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి (IPS officer Rajeev Kumar). పబ్లిక్‌ పాలసీ, వివిధ రంగాల్లో పాలనకు సంబంధించి కుమార్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
Jio Fiber Plans Revamped: జియో కొత్త వ్యూహం, రూ. 399కే జియో ఫైబర్ ప్లాన్, ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ పేరిట కొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించిన జియో
Hazarath Reddyప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌కు (JioFiber) సంబంధించి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం (new broadband plans) అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో తెలిపింది. ఇందులో భాగంగా ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌' పేరిట సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేకుండా నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం అవుతాయని జియో తెలిపింది.
Pranab Mukherjee Biography: స్కూలు చదువు కోసం రోజూ 10 కిలోమీటర్ల నడక, జర్నలిస్టు నుంచి రాష్ట్రపతి దాకా.., ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాకుండా అడ్డుపడిందెవరు? ప్రణబ్ దాదా జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం (Pranab Mukherjee No more) చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మృతితో రాజకీయపార్టీలకు అతీతంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కొనసాగిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ (Pranab Mukherjee) పని చేశారు. ఆయ‌న్ను అందరూ ప్ర‌ణ‌బ్ దాదాగా పిలుస్తుంటారు. బెంగాల్‌లో ప్ర‌ణ‌బ్ దా అనే పిలుపు చాలా పాపుల‌ర్ అయ్యింది.
LPG Gas Cylinder New Rules: ఇకపై ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ, నిబంధనల్లో పలు మార్పులను తీసుకువచ్చిన ఆయిల్ కంపెనీలు, త్వరలో వాట్సాప్‌ ద్వారా కూడా నగదు చెల్లించే సదుపాయం
Hazarath Reddyబుక్‌ చేసిన సిలిండర్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు, పాత నిబంధనల్లో మార్పు (New Rules For LPG Gas Cylinder) చేశారు. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఆయిల్‌ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్‌ డెలివరీ (LPG Gas Cylinder delivery) ఇవ్వనున్నారు. డెలివరీ బాయ్‌కి కస్టమర్ ఓటీపీ (OTP) చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుని ఇకపై సిలిండర్‌ (LPG Cylinder) అందజేస్తాడు. దీంతో బుక్‌ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్‌ అందుతుంది. OTP లేకపోతే, వినియోగదారులు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా కూడా డెలివరీ తీసుకోవచ్చు.
Delhi Metro New Guidelines: అయిదు నెలల తరువాత.. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్లు ప్రారంభం, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం
Hazarath Reddyకరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు (Delhi Metro New Guidelines) అన్‌లాక్‌-4 లో (Unlock 4) భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల (Delhi Metro) ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ కేసుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
India Coronavirus: రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyకేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం విడుద‌ల చేసిన‌ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కరోనాతో తాజాగా 948 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్‌ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Unlock 4 Guidelines: బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
Hazarath Reddyకరోనావైరస్ లాక్‌డౌన్‌లో భాగంగా సడలింపులు ఇచ్చుకుంటూ వస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను (Unlock 4 Guidelines) ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ (MHA) అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను ప్రకటించింది. పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం (Metro Rail open) కానున్నాయి. సెప్టెంబరు 7వ తేదీ నుంచి రాష్ట్రాలు మెట్రోరైళ్లను నడపవచ్చని పేర్కొంది. అయితే.. కేంద్ర హోంశాఖను సంప్రదించాకే.. పరిమితంగా సేవలను అందించాలని స్పష్టం చేసింది.
AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.
Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి
Hazarath Reddyఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.
Sonu Sood: ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం
Hazarath Reddyసోనూ ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ (Chhattisgarh chief minister Bhupesh Baghel) సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Coronavirus in India: భారతీయుల్లో కరోనాని తరిమేసే యాంటీబాడీలు ఎక్కువే, దేశంలో తాజాగా 64,531 మందికి కోవిడ్-19, తమిళనాడు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్‌‌కు కరోనా
Hazarath Reddyదేశంలో 24 గంటల్లో 64,531 మందికి కరోనా (Coronavirus in India) సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి (Coivd Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic India) ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టిర‌వ‌కు 3,17,42,782 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఆగ‌స్టు 18న 8,01,518 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది. ‌
Swine Flu: కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక
Hazarath Reddyదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సరికొత్త వ్యాధులు దానికి తోడయ్యాయి. వైరల్ వ్యాధి కరోనా (Covid-19) దేశంలో ప్రజలకు నిదర లేకుండా చేస్తుంటే దానికి స్వైన్ ఫ్లూ ( Swine flu (H1N1) తోడయింది. ఇవి రెండు దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు (swine flu cases) నమోదు కాగా ఈ వ్యాధివల్ల 44 మంది మరణించారు.
Mann Ki Baat on August 30: ఆగస్టు 30 న ప్రధాని మోదీ మన్ కీ బాత్, దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్న ప్రధాని, 1800-11-7800కి డయల్ చేసి మీ సందేశాన్ని ఇవ్వండి
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 30 ఉదయం 11 గంటలకు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Mann Ki Baat on August 30) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియోలో జరిగే ‘మన్ కి బాత్’ (PM Modi to address Mann Ki Baat) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Manish Kumar Sinha: విశాఖకు కొత్త బాస్, ఆర్కే మీనా స్థానంలో బాధ్యతలు స్వీకరించిన మనీష్ కుమార్ సిన్హా, విశాఖ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపిన మాజీ సీపీ ఆర్కే మీనా
Hazarath Reddyవిశాఖకు కొత్త పోలీస్ వచ్చారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా (Manish Kumar Sinha) బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి వరకు సీపీగా పని చేసిన రాజీవ్ కుమార్ మీనా (RK Meena) నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేశారు. డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సీపీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Pranab Mukherjee Health Update: వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, పరిస్థితి విషమంగానే ఉందని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి అధికారులు, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన అభిజిత్
Hazarath Reddyమాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ( Pranab Mukherjee Health Update) విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ (Condition Remains Critical) ప్రణబ్‌ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు.
Heavy Rain Floods: మరో అల్ప పీడనం..తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను వరదలు (Heavy Rain Floods) ముంచెత్తాయి. రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rians Hits Telugu States) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం దశ, దిశ ఇప్పటివరకు తెలియకపోవటంతో... ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో తెలియడం లేదు.
Indian Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..
Hazarath Reddy1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిస‌త్వం నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
Rs 2,000 Notes Printing Stopped: రెండు వేల నోటు ప్రింటింగ్ ఆగిపోయింది, ఆర్టీఐ కార్యకర్తకు సమాధానం ఇచ్చిన ఆర్‌బీఐ, రూ. 200 నోటు ప్రింటింగ్‌కే ఎక్కువ ఖర్చు అవుతుందని వెల్లడి
Hazarath Reddyపెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్రం వెయ్యి రూపాయ‌ల‌కు బ‌దులుగా 2వేల రూపాయ‌ల నోటును (Rs 2,000 Notes Printing Stopped) తీసుకొచ్చింది. న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రొత్స‌హిస్తూనే 2వేల రూపాయ‌ల‌ను తీసుక‌ురావ‌టంపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India (RBI) దాని ముద్రణను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ లేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ (RTI Activist) పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది.
Telangana Police: తెలంగాణ పోలీసుల హెచ్చరిక, సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెడితే కఠిన చర్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపిన తెలంగాణ డీజీపీ
Hazarath Reddyసోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెట్టడంతో బెంగుళూరులో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. పోలీసులకు దుండుగులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) అలర్ట్ అయింది. సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana Director General of Police M. Mahender Reddy) రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు.
Rain Alert in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు (Rain Alert in AP) పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (Disaster Management Authority) తెలిపింది. ఈ నేపథ్యంలొ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.