Information

Telangana Lockdown Extension: ఇళ్లలోనే పండుగలు, ప్రార్థనలు, మే 7 వరకు ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు, ఇంటి యజమానులు 3 నెలలు పాటు అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు, మీడియాతో సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Telangana Lockdown) మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తెలంగాణలో అలాంటివి ఏవీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

Lockdown 2.0: ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే, ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం, లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగింపు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను (Coronavirus lockdown) మే 3 వరకు పొడిగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత హాట్‌స్పాట్ (Coronavirus Hotspots) లేని ప్రదేశాల్లో ఆంక్షలను సడలించాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)సూచించారు. ఏప్రిల్ 20 తర్వాత ప్రారంభమయ్యే సేవల్లో ఆరోగ్యం, వ్యవసాయం, మరియు -కామర్స్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మొదలైనవి. వైద్య ప్రయోజనాల మినహా ఫ్లైట్, రైలు, మెట్రో సేవలు మరియు అంతర్-రాష్ట్ర రవాణా మే 3 వరకు నిలిపివేయబడతాయి.

Central Govt Praises RBI: ఆర్‌బీఐ చర్యలను ప్రశంసించిన కేంద్రం, రుణాల జారీ మెరుగుపడుతుందన్న ప్రధాని, దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందన్న హోం మంత్రి

Hazarath Reddy

ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్‌ షాలు ప్రశంసించారు. కేంద్ర బ్యాంక్‌ చర్యలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరగడంతో పాటు రుణాల జారీ మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

RBI Reduces Reverse Repo Rate: ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ప్లాన్ 2 అమలు చేస్తున్న ఆర్‌బిఐ, రివర్స్ రెపో రేటు పావు శాతం కోత, మీడియాతో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) కారణంగా దేశంలో తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం,అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు,క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. దేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను RBI ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు (Coronavirus lockdown) పొడిగించిన తరువాత ఈ సమావేశం జరిగింది.

Advertisement

Delhi 'Plasma Therapy': కరోనావైరస్ రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్, ట్ర‌య‌ల్స్ ప్రారంభించిన ఢిల్లీ సర్కారు, అసలేంటి ఈ చికిత్స ?

Hazarath Reddy

ఢిల్లీ సర్కారు కోవిడ్-19 (COVID-19) మీద పోరాటానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. క‌రోనావైరస్ (Coronavirus) సోకిన వారికి త్వ‌ర‌లోనే ప్లాస్మా చికిత్స (Plasma Therapy) ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్ర‌య‌ల్స్ ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గురువారం ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా ల‌భించింద‌ని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇది విజ‌య‌వంత‌మైతే త్వ‌ర‌లోనే కరోనా రోగుల‌కు ఈ విధ‌మైన చికిత్స అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

Jallikattu Bull Funeral: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, జల్లికట్టు ఎద్దుకు అంత్యక్రియలు, వేలాది మంది హాజరు, మధురై అనంగానల్లూరు గ్రామస్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా కఠినంగా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలు చేస్తున్నారు. అయినా కొందరు లాక్ డౌన్ ( lockdown) నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరిస్తున్న తమిళనాడులో కూడా లాక్‌డౌన్ ఉల్లంఘన జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఓ ఎద్దుకు (Jallikattu Bull Funeral) అంత్యక్రియలు నిర్వహించారు.

AP English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

Hazarath Reddy

పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

COVID-19 in India: 400 దాటిన కరోనా మృతులు, దేశంలో 12 వేలు దాటిన కరోనా కేసులు, అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్‌ (Deadly COVID 19 in India) రోజురోజుకి విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు భారత్‌లో 12,380 మందికి కోవిడ్ 19 (COVID 19) పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. 414 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,477 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదుకాగా, 187 మంది మృతిచెందారు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Advertisement

Hostspots in Telugu States: ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం, 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు..

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రాల వారీగా రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 (Covid 19) వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది.

Coronavirus Cases in India: దేశంలో ఆగని కరోనా ఘోష, 12వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 392కు చేరిన మృతుల సంఖ్య, హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు

Hazarath Reddy

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Coronavirus) తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases) 12 వేలకు దగ్గర్లో ఉంది. బుధవారం సాయంత్రం నాటికి కరోనా బాధితుల సంఖ్య 11,933కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాదాపు 1,118 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా ( COVID 19)నుండి ఇప్పటి వరకు 1,343 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 392 మంది కరోనాతో మరణించారు.

Airline Firms Declined Refund: డబ్బులు రిఫండ్ చేసేది లేదు, ప్రయాణికులకు షాకిచ్చిన విమానయాన సంస్థలు, రీషెడ్యూల్ చేసుకోవాలని సూచన

Hazarath Reddy

విమాన కంపెనీలు (Airline Firms) ప్రయాణికులకు షాకిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 దాకా పొడిగించడంతో (Extension of Lockdown) పాటు విమానసేవలను కూడా అప్పటిదాకా రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్‌ చార్జీలు రీఫండ్‌ చేయరాదని (Airline Firms Declined Refund) నిర్ణయించాయి. అదనపు రుసుములేమీ లేకుండా ప్రయాణికులు మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ప్రకటించాయి.

IRCTC Offers Full Refund: 39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్, మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మే 3 వరకు లాక్‌డౌన్ (Lockdown) కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది. ఈ క్రమంలో మే 3 వరకు రద్దైన అన్ని రైళ్లకు టికెట్ బుకింగ్స్ చార్జీలను రీఫండ్ చేస్తామని భారత రైల్వే శాఖ ప్రకటించింది.

Advertisement

Vijay Devarkonda: పోలీసులకు బూస్ట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి, ప్రాణాలకు తెగించి మా కోసం కష్టపడుతున్నారు, మీ అందరికీ వందనాలు

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) పోలీస్ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ (Police Commissioner Anjani Kumar) ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు.

Lockdown Guidelines: లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ వచ్చేశాయి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, రేపు పూర్తి స్థాయి మార్గదర్శకాలు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై (Lockdown) కేంద్ర హోంశాఖ (Home ministry) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలకు ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకు లాక్‌డౌన్ సందర్భంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుందని హోంశాఖ తెలిపింది.

COVID-19 in Dharavi: దేశానికి దిగులు పుట్టిస్తున్న ధారావి, ఏడు మంది కరోనా కాటుకు బలి, 55కు చేరిన కోవిడ్ -19 కేసుల సంఖ్య, ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి (Dharavi COVID-19) దేశానికి దిగులు పుట్టిస్తోంది. ముంబైలో విస్తరించి ఉన్న ఈ మురికివాడలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా (6 New Cases), ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (Brihanmumbai Municipal Corporation (BMC)) పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.

Coronavirus Lockdown: దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్, అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ రైల్వే,సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Hazarath Reddy

దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ (India Lockdown) పొడిగిస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఎక్కడి సర్వీసులు అక్కడే నిలిచిపోనున్నాయి. మరో 19 రోజుల పాటు రైళ్లు, విమానాలు అన్నీ బంద్ కానున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే (Indian Railways),సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ (Ministry of Civil Aviation) సంయుక్తంగా ప్రకటించాయి. మే 3 తర్వాత నడుస్తాయా లేదా అనేదానిపై ఇంక్లా క్లారిటీ లేదు. పరిస్థితులను బట్టి వెల్లడిస్తామని తెలిపాయి.

Advertisement

Aarogya Setu App: ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.

PM Narendra Modi Saptapadi: ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు, దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ (Lockdown extension in India) పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్ర‌క‌టించారు. ప్రజలు అందరూ కూడా మే 3 వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచించారు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు మోడీ. కరోనా హాట్ స్పాట్ ల మీద ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఏడు సూచనలు (PM Modi Saptapadi) చేసారు. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌లంద‌రై త‌ప్ప‌క పాటించాల్సిన ఏడు నియ‌మాల‌ను ప్ర‌ధాని వెల్ల‌డించారు.

PM Narendra Modi: లాక్‌డౌన్‌పై స్పష్టత, మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం, కరోనా నేఫథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజిస్తారని ఊహాగానాలు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి (PM Modi to Address the Nation) ప్రసంగిస్తారు. ఏప్రిల్ 14 న 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ (Lockdown) చివరి రోజు కావడంతో ప్రధాని (PM Modi) దీనిని పొడిగించాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ రోజు ప్రసంగంలో, దేశంలో కరోనావైరస్ (Coronavirus) సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రధాన మార్గం గురించి ప్రధాని మాట్లాడాలని భావిస్తున్నారు.

Supreme Court: ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి, విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇది సమయం కాదు, పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు వెల్లడి

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ (Nationwide lockdown) మధ్య విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించాలని కోరుతున్న పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ కేసులో పలు పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే (Chief Justice of India SA Bobde) నేతృత్వంలోని ధర్మాసనం, విదేశాలలో చిక్కుకున్న ప్రజలందరినీ తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement
Advertisement