Bandra Lockdown Violation: ముంబై బాంద్రాలో వలస కార్మికుల ఘోష, లాక్‌డౌన్ పొడిగింపుపై నిరసన, హింసాత్మకంగా మారిన వాతవరణం, రంగంలోకి దిగిన హోమంత్రి అమిత్ షా
అయితే ఈ లాక్‌డౌన్ పొడిగింపును నిరసిస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ (Bandra Railway Station) ప్రాంతంలో వేలాది వలస కార్మికులు భారీ ప్రదర్శనకు యత్నించారు. లాక్‌డౌన్ నిబంధనలు (Lockdown Impact) సామాజిక దూరం సూచనల్ని పక్కనబెట్టి మంగళవారం మధ్యాహ్నం గుంపులుగా రోడ్లపైకొచ్చారు.
Mumbai, April 14: ప్రధాని మోడీ (PM Modi) దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ (Lockdown) పొడిగించిన విషయం విదితమే. అయితే ఈ లాక్‌డౌన్ పొడిగింపును నిరసిస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ (Bandra Railway Station) ప్రాంతంలో వేలాది వలస కార్మికులు భారీ ప్రదర్శనకు యత్నించారు. లాక్‌డౌన్ నిబంధనలు (Lockdown Impact) సామాజిక దూరం సూచనల్ని పక్కనబెట్టి మంగళవారం మధ్యాహ్నం గుంపులుగా రోడ్లపైకొచ్చారు.
అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. వారి మాటల్ని నిరసనకారులు లెక్కచేయకపోడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనమైంది.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home minister Anith shah) మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని (CM Uddhav Thackeray) అలర్ట్ చేశారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో వలస కూలీలు గుమిగూడడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ANI Tweet:
ఇలాంటి సంఘటనలు కరోనావైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తాయని, ఇలాంటి సంఘటనలు జరగకుండా పరిపాలన అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి నొక్కి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి హోమంత్రి అమిత్ షా తన పూర్తి మద్దతును కూడా ఇచ్చాడు.
లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు
బాంద్రాలోని వందలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లనివ్వమంటూ అధికారులను కోరుతూ వీధుల్లోకి వచ్చారు. బాంద్రా బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు భారీ సమావేశం జరిగింది. పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు ఈ విషయం మీద జోక్యం చేసుకుని వలస కార్మికులను చెదరగొట్టారు. కాగా లాక్డౌన్ పొడిగింపు కారణంగా వలసదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బాంద్రా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సుమారు 1500 మంది గుమిగూడారు. వీరిలో చాలా మంది వలస కూలీలు. వీరంతా లాక్డౌన్ పొడిగింపుపై అసంతృప్తితో ఉన్నారు మరియు వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుకున్నారు. వారు తమ డిమాండ్‌ను పరిపాలన ముందు ఉంచారని ముంబై పోలీసు పిఆర్‌ఓ డిసిపి ప్రణయ అశోక్ తెలిపారు."స్థానిక పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి, వారితో మాట్లాడి వారిని ఒప్పించటానికి ప్రయత్నించారు.
దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్
ఈ సమయంలో అక్కడ పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వారిని అదుపులోకి తీసుకురావడానికి తేలికపాటి శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. జనాన్ని చెదరగొట్టారు. పోలీసులను అక్కడ మోహరించారు "పరిస్థితి సాధారణమైనది మరియు ప్రశాంతమైనది" అని ఆయన చెప్పారు.
Tweet by Aaditya Thackeray:
మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ప్రభుత్వం సక్రమంగా ప్రణాళిక చేయకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని అన్నారు. వలస కార్మికులను ఇంటికి తిరిగి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వకపోవడమే దీనికి కారణం. వారికి ఆహారం లేదా ఆశ్రయం ఏమీ వద్దు, వారు ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను "అని ట్వీట్ చేశాడు.
Here is the Video of the Bandra Incident:
కాగా, దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ అమల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు. అయితే, రోజూ కూలీ చేసుకుని బతికే తాము తిండిలేక చస్తున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
ఇక మంగళవారం సాయంత్రం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 10,815 కు చేరగా.. 1189 మంది కోలుకున్నారు. 353 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 9272గా ఉంది. 2337 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. కేవలం ముంబై నగరంలోనే 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో 160 మంది మరణించగా.. 229 మంది కోలుకున్నారు.