వార్తలు

Hyderabad Horror: ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు ,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన, మృతురాలు బ్యూటిషిన్‌గా గుర్తింపు

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తునట్లు గుర్తించారు పోలీసులు.

Nagarjuna Sagar Project Gates Open: శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద, సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...వీడియో

Arun Charagonda

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం : 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు

Mopidevi Venkataramana Vs Ambati Rambabu: టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్

Arun Charagonda

ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.

Andhra Pradesh: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోళ్తా, 5గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు

Arun Charagonda

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి సమీపంలో ఆర్టీసీ బస్సు బోళ్తా పడింది. నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కోటకు వెళుతుండగా మోమిడి వద్ద అదుపు తప్పి బస్సుకు ప్రమాదం జరుగగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Passport Seva Portal To Shut Down: దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ సేవలు బంద్, 3 రోజుల పాటు పాస్‌పోర్టు సర్వీసులు పనిచేయవు

Arun Charagonda

దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్ కానున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు పనిచేయవని పాస్ పోర్ట్ సేవా సమితి తెలిపింది. సాఫ్ట్ వేర్ మెయింటెనెన్స్ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Hero Ajith Kumar: 234 కిమీల వేగంతో కారును నడిపిన హీరో అజిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Arun Charagonda

234kms వేగంతో కారును నడిపారు హీరో అజిత్ కుమార్. తన ఆడి కారులో 234 కిమీల వేగంతో అజిత్ దూసుకెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అజిత్‌కు బైక్, కార్ రేసింగ్ పై చిన్నప్పటి నుండి మక్కువ ఉన్న సంగతి తెలిసిందే.

MLC Kavitha First Tweet: జైలు నుండి బయటకు వచ్చిన 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ ట్వీట్, సత్యమేవ జయతే అంటే కేటీఆర్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన కవిత

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 165 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోగా సుదీర్ఘ విరామం తర్వాత ఎక్స్‌ వేదికగా తొలి ట్వీట్‌ చేశారు. సత్యమేవ జయతే అంటూ భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు

Andhra Pradesh: ఇలా జైలు నుండి వచ్చాడు..అలా కిడ్నాప్ చేసేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలులో కిడ్నాప్ కలకలం, ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసుల అనుమానం

Arun Charagonda

బెయిల్ పై విడుదలైన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు దుండగులు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒరిస్సా వ్యాపరి సంజయ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

KTR America Tour: అమెరికాకు కేటీఆర్, వ్యక్తిగత పర్యటన అని ట్విట్టర్ ద్వారా వెల్లడి, అమెరికా నుండి రష్యాకు వెళ్లనున్న కేటీఆర్

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తన సోదరికి బెయిల్ నేపథ్యంలో అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 15న రాత్రి 7: 15కి ఇంటి నుంచి డిల్లీకి వెళ్లిన కవిత...ఆ తర్వాత 165 రోజులకు బుధవారం రాత్రి 7: 15కి తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అనంతరం కేటీఆర్‌కి రాఖి కట్టారు కవిత.

AP Student Died in USA: అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, స్నేహితుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకుంటూ స‌ర‌స్సులో ప‌డిపోయిన యువ‌కుడు

VNS

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) (Rupa reddy) అమెరికాలోని జార్జ్‌ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా (Telugu Student de in USA) వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో చేరాడు.

CM Revanth Reddy Reviews South RRR: అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీ,రీజనల్ రింగ్‌ రోడ్డుపై సీఎం రేవంత్ రివ్యూ, భూ సమీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

Arun Charagonda

సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్య‌మైనంత ఎక్కువ ప‌రిహారం ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప‌రంగా అద‌నంగా ఏవిధ‌మైన స‌హాయం చేయ‌గ‌ల‌మో ఆలోచించి రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారిపై సమీక్ష నిర్వహించారు సీఎం.

Hyderabad:పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఇంటికి వెళ్లి మ‌రీ యువ‌తి పీక కోసిన ఉన్మాది, ఆపై క‌రెంట్ స్తంభం ఎక్కి వైర్లు ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం, యువ‌తి మృతి

VNS

హైదరాబాద్‌ (Hyderabad) గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. పెళ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

Advertisement

Big Shock to YSRCP: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధ‌మైన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, మ‌రికొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం

VNS

ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

UP Digital Media Policy: ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టు పెడితే జీవిత‌ఖైదు, అనుకూలంగా ప్ర‌చారం చేస్తే రూ. 8 లక్ష‌లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ల‌కు బంపర్ ఆఫ‌ర్

VNS

సోషల్‌ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు (Life Sentence) వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త డిజిటల్‌ మీడియా పాలసీని (UP Digital Media Policy) రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయ‌న సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాల‌నీలో నోటీసులు అందుకున్న‌వారిలో ప‌లువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు

VNS

హైడ్రా (Hydra)దూకుడు కొన‌సాగుతోంది. చెరువులు, కుంట‌ల‌ను ఆక్ర‌మించి కట్టుకున్న నిర్మాణాల‌పై కొర‌డా ఝ‌లిపిస్తోంది. ఎవర్నీ వ‌ద‌ల‌కుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.

Telugu Language Day 2024 Wishes: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండిలా..?

sajaya

అమెరికాలో సైతం తెలుగు భాష రెండవ అతిపెద్ద విదేశీ భాషగా హిందీ తో సమానంగా పేరు తెచ్చుకుంది. ఇక భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి.

Advertisement

Telugu Basha Dinotsavam 2024 Wishes: మీ బంధు మిత్రులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు లేడు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొన‌సాగుతున్న టీమిండియా ప్లేయర్లు

Vikas M

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) టెస్టు ర్యాంకుల‌ను విడుద‌ల చేసింది. ఇందులో ముగ్గురు టీమిండియా బ్యాట‌ర్లు టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 751 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండగా, భార‌త యువ సంచ‌ల‌నం య‌శ‌స్వి జైస్వాల్ (740) ఒక స్థానం మెరుగుప‌ర‌చుకుని ఏడో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.

Dawid Malan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్, ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నట్లుగా వార్తలు

Vikas M

ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్టార్, అత్యంత తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం ద‌క్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగాడు. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిల‌వ‌డంలో మలన్ కీరోల్ పోషించాడు.

Zaheer Khan: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్‌గా జ‌హీర్ ఖాన్, ముంబైని వదిలేసిన టీమిండియా మాజీ పేసర్

Vikas M

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేస్ బౌలర్ జ‌హీర్ ఖాన్ ఎంపికైన‌ట్లు ఆ ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక వీడియోను విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement