వార్తలు
Pushpa 2 New Poster: పుష్ప-2 నుంచి అదిరిపోయే పోస్టర్, రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ లుక్..
Vikas Mపుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు.
Uttar Pradesh Shocker: ఇదేం విచిత్రం.. చనిపోయిన చెల్లెలి కోసం ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే సమాధిని నిర్మించిన అన్నలు, ఇద్దర్ని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Vikas Mకౌశాంబిలోని ఆషాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సమాధిని నిర్మిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు సోదరులు మహ్మద్ కాసిమ్ మరియు మహ్మద్ హషీమ్‌లను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆగస్టు 27న అరెస్టు చేశారు.
US: దారుణం, పిల్లల ముందే పెంపుడు కుక్కను కాల్చిన పోలీస్ అధికారి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5,000 మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం
Hazarath Reddyడావెన్‌పోర్ట్, అయోవా పోలీసు అధికారి, ఏతాన్ బాక్‌గా గుర్తించబడి, ఆగస్ట్ 21న కుక్కను దాని యజమానులు మరియు వారి చిన్నపిల్లల ముందు ఘోరంగా కాల్చి చంపిన తర్వాత విచారణలో ఉన్నారు. నార్త్ పైన్ స్ట్రీట్ 800 బ్లాక్ సమీపంలో కంచెను దూకేందుకు ప్రయత్నిస్తున్న నాలుగు దూకుడు కుక్కల నివేదికపై బాక్ స్పందించారు.
When Is Ganesh Chaturthi 2024? గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ఈ పండుగ తేదీలు, శుభ ముహూర్తం మరియు ఆచారాలను తెలుసుకోండి
Vikas Mగణేష్ చతుర్థి 2024: వినాయక చతుర్థి లేదా గణేష్ ఉత్సవ్ అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి.. గణేశుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడుగా భావిస్తారు.
Wanaparthy : వనపర్తిలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి, అతివేగమే కారణం!
Arun Charagondaవనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి డిపో కి చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా ద్విచక్ర వాహనం అతివేగంతో వెళ్లడం తోనే ప్రమాదం జరిగినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ మధ్యలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్, వెంటనే అలర్ట్ అయి కేకలు వేసిన RPF కానిస్టేబుల్, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddy75 ఏళ్ల వృద్ధుడైన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కదిలే రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్, అక్కడి ప్రయాణికుల సాయంతో అతన్ని రక్షించారు ఈ ఘటన తిరుచ్చి రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది.
Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 342 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, జ్వరం కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, గత 3 రోజుల్లో 800 మందికి అనారోగ్యం
Hazarath Reddyఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
12 Industrial Smart Cities: దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, రూ.28,602 కోట్ల నిధులు కేటాయింపు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అంటే..
Hazarath Reddyబుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
12 Industrial Smart Cities: కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..
Hazarath Reddyబుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జోగి రమేష్, పెనమలూరు ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ
Hazarath Reddyరెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామిస్తూ వైఎస్సార్‌సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.
Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.
Patna: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు
Hazarath Reddyపాట్నాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, మహాత్మా గాంధీ సేతు వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్న 24 ఏళ్ల మహిళ ఆగస్టు 28న సుమారు 15 అడుగుల ఎత్తు నుండి గంగా నదిలోకి పడిపోయింది. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోవడం వీడియోలో బంధించబడింది. ఆమె నదిలో పడిపోయి సహాయం కోసం కేకలు వేసింది.
MLC Kavitha At Shamshabad: శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం, పిడికిలి బిగించి అభివాదం తెలిపిన కవిత, ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు...వీడియో
Arun Charagondaఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.
Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన, తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడటంతో పెళ్లి చేసిన భార్య..వీడియో
Arun Charagondaతన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడటంతో దగ్గరుండి మరి రెండో వివాహం జరిపించింది భార్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరుగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Delhi Horror: ఢిల్లీలో దారుణం, శ్మశానంలో మైనర్ బాలికపై దొంగ బాబా అత్యాచారం, కుద్ర పూజల ద్వారా మీ తండ్రి వ్యాధిని నయం చేస్తానంటూ..
Hazarath Reddyఅనారోగ్యంతో ఉన్న తన తండ్రికి క్షుద్ర పూజలు ద్వారా జబ్బును నయం చేస్తాననే నెపంతో మైనర్ బాలికపై 52 ఏళ్ల వ్యక్తి పశ్చిమ ఢిల్లీలోని రోహిణిలోని స్మశాన వాటికలో అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులు బుధవారం తెలిపారు.
Attack On MLA Kale Yadaiah: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సొంతపార్టీ నేతలే కోడిగుడ్లతో దాడి, కష్టపడ్డ కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్..వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్‌లో అంతర్గతపోరు మరోసారి బయటపడింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని,కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, కడప వైసీపీ మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన టీడీపీ కార్యకర్తలు, చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) మధ్య కొత్త చెత్త పన్ను నిబంధనపై రాజకీయ ఘర్షణ తీవ్రమైంది. కడపలోని వైఎస్సార్‌సీపీ మేయర్ సురేశ్‌బాబు అధికారిక నివాసం ఎదుట టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిసి చెత్తబుట్టలు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పన్ను చెల్లిస్తేనే చెత్త సేకరిస్తామన్న మేయర్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.
Astrology: ఆగస్టు 31న బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయిన బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాపారానికి మేధస్సుకి గౌరవానికి బాధ్యత వహించే గ్రహం. బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి
Astrology: ఆగస్టు 29 అజ ఏకాదశి, మూడు యోగాల కలయిక వల్ల..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaఏకాదశి విశిష్ట ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కష్టాలు, పాపాలు అన్నీ కూడా నయమవుతాయని నమ్ముతారు.
MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్‌బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు
Hazarath Reddyవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు.