News

Eluru Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, సిమెంట్‌ను లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, 20 మందికి గాయాలు

Hazarath Reddy

ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం (Eluru Road Accident) జరిగింది

S Jaishankar Security Scare: వీడియో ఇదిగో, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి, లండన్‌ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం

Hazarath Reddy

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ యూకే పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ అనుచరులు దాడికి యత్నించడం కలకలం రేపింది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలు ఆయన కారువైపు దూసుకొచ్చారు.

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో పరువు హత్య.. కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి, వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఘాతుకం

Arun Charagonda

అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది . కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు తండ్రి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కూతురిని చంపేశారు తండ్రి.

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.

Advertisement

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Arun Charagonda

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

Liquor Party At Police Station: ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో మందు పార్టీ.. వైరల్‌గా మారిన న్యూస్, చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Arun Charagonda

ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Warangal Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా, ఒకరు మృతి, 28 మందికి గాయాలు

Arun Charagonda

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Warangal Road Accident). కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఒకరు మృతి చెందారు.

Teacher Harasses: గురుకులంలో కీచక టీచర్.. తోటి మహిళా ఉద్యోగినికి వేధింపులు, మంచిర్యాల జిల్లాలో ఘటన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు

Arun Charagonda

తెలంగాణలోని గురుకులంలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది(Teacher Harasses). తోటి మహిళా ఉద్యోగినిపౌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు.

Advertisement

Customers Protest At SBI Bank: మా బంగారం మాకు ఇవ్వండి... రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కస్టమర్ల ఆందోళన, బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారని మండిపాటు

Arun Charagonda

వరంగల్ జిల్లా రాయపర్తిలో మా బంగారం మాకు ఇవ్వండి అని కస్టమర్లు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది

IML 2025: సచిన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఫోర్లు- సిక్సర్లతో ఆస్ట్రేలియాపై విరుచుకపడ్డ సచిన్, కానీ!

Arun Charagonda

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు(IML 2025). 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్.

Kanpur Fire Breaks Out: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్నిప్రమాదం... చెక్క గోదాంలో చెలరేగిన మంటలు, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది(Kanpur Fire Breaks Out). ఓ చెక్క గోదాములో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి

Arun Charagonda

కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డి గెలుపొందారు

Advertisement

TG Cabinet Meet Today: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం... బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు

Arun Charagonda

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Amarnath Yatra 2025 Dates: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు

VNS

మర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు.. అమర్నాథ్ యాత్ర తేదీలను (Amarnath Yatra 2025) ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పవిత్రమైన అమర్నాథ్ గుహకు వార్షిక తీర్థయాత్ర జూలై 3, 2025న ప్రారంభం కానుంది. 39 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రక్షా బంధన్ రోజున(ఆగస్ట్ 9) ముగుస్తుంది.

Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్

VNS

తాజాగా సోని లివ్ ఏజెంట్ సినిమా తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. మార్చ్ 14 నుంచి ఏజెంట్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ హమ్మయ్య ఇప్పటికైనా ఎజెంట్ సినిమా ఓటీటీలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

VNS

దేశవ్యాప్తంగా హోలీ పండుగ (Holi festival) ను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement

Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్‌న్యూస్‌, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత

VNS

భానుడి ప్రతాపానికి అతలాకుతలమ‌వుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. రాబోయే 48 గంటలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో టెంపరేచర్‌ తక్కువ స్థాయిలో నమోదు అవుతుందన్నారు

EPF withdrawal via UPI: ఇక పీఎఫ్‌ విత్‌డ్రా చేయడం చాలా సులభం, యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్న కేంద్రం

VNS

ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్‌డ్రా ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్‌ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్‌ నగదును కూడా విత్‌ డ్రా (EPF Withdraw) చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ (UPI) ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

Korutla SI Shankaraiah: పేకాటలో పట్టుబడ్డ వారి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన కోరుట్ల ఎస్సై శంకరయ్య

Hazarath Reddy

జగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కోరుట్ల ఎస్సై శంకరయ్య. ఓ వ్యక్తి నుంచి కేసు రాజీ కోసం 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి. పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు

CM Chandrababu Meets HM Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం తదితర అంశాలపై చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. ఏపీకి చెందిన పలు అంశాలపై వారితో చర్చించారు.

Advertisement
Advertisement