Three State Capitals: మూడు రాజధానులకు సై, ఏపీకి రాజమహల్స్ అవసరం లేదన్న ఆర్థిక మంత్రి బుగ్గన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, సీఆర్డీఏ రద్దు బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చిన ఏపీ రాజధాని(AP Capital) అంశం ఓ కొలిక్కి వచ్చేసింది. మూడు రాజధానులపై(Three State Capitals) ముందడుగు పడింది. ఏపీ ప్రభుత్వం(AP Govt) మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును (Three State Capitals Bill) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (Andhra Pradesh Assembly)ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు.

Andhra Pradesh Assembly | Photo Credits : PTI

Amaravathi, January 20: గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చిన ఏపీ రాజధాని(AP Capital) అంశం ఓ కొలిక్కి వచ్చేసింది. మూడు రాజధానులపై(Three State Capitals) ముందడుగు పడింది. ఏపీ ప్రభుత్వం(AP Govt) మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును (Three State Capitals Bill) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (Andhra Pradesh Assembly)ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు.

దీంతో పాటుగా సీఆర్డీఏ రద్దు(CRDA cancellation) బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాజధాని అంశంలో కీలక మలుపు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..(Finance Minister B Rajendranath) వికేంద్రీకరణ బిల్లుని.. ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్స్ వంటి భవనాలు అవసరం లేదు... ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు' అని అన్నారు.

కీలక ఘట్టానికి వేదిక కానున్న ఏపీ అసెంబ్లీ

చట్ట సభల రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని చెప్పారు. అమరావతి రైతులకు భూములు వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు

'కర్నూలులో జ్యుడీషియల్ రాజధానిగా ఉంటుందని తెలిపారు. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. అలాగే అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం ఉంటుందని తెలిపారు.

భారీ బందోబస్తు మధ్య ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి తెలిపారు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం' అని బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు.3,4 జిల్లాలకు కలిపి ఓ జోనల్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు

గత వందేళ్ల చరిత్రను చూస్తే అభివృద్ధి ముఖ్యమని కనిపిస్తోంది.1920లోనే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభను పెట్టారు. ఉప ప్రాంతాలు అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలు తప్పవు. తెలంగాణ ఏర్పాటు కూడా అదే కోవకు చెందుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పోలిక లేదు. ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలున్నాయి.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉప ప్రాంతాలను సమనంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ అనేక అంశాలను పరిశీలించింది. ఆ కమిటీ కూడా తెలంగాణ కన్నా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని కమిటీ రిపోర్టులో తెలిపింది.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా 13 జిల్లాలను సమాన అభివృద్ధి చేయాలని సూచించింది. ఒకే నగరాన్ని అభివృద్ధి చేయవద్దని కమిటీ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని తేల్చిచెప్పింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమని కమిటీ అభిప్రాయపడింది.

జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు

వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌గా మార్చవద్దని కూడా సూచించింది. జియలాజికల్ సర్వే కూడా పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు నిర్శించవద్దని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పింది’ అని ఆర్థికమంత్రి అసెంబ్లీలో అన్నారు.

కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్‌ ఐపీఎస్ అధికారి

మరోవైపు సమావేశం ప్రారంభమైన వెంటనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలోకి స్పీకర్ తమ్మినేని ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. దీనికి ప్రతిస్పందనగా... ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారని... బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ చమత్కరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now