Jagananna Amma Vodi: సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి, హాజరుతో పనిలేదు, 9వ తేదీ నేరుగా తల్లుల అకౌంట్లోకి అమౌంట్, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

AM CM YS Jagan in review meeting on Jagananna Amma Vodi scheme (Photo-Twitter)

Amaravathi, December 07: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా

అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో అమ్మ ఒడి పథకం (AP AMMA VODI SCHEME 2019) అందాల్సిందేనని, నిబంధనలంటూ ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌

జనవరి 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని(Amma Vodi Scheme) సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల 400 కోట్లు కేటాయించింది. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి/సంరక్షకులకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయంగా ఇస్తారు. ముందుగా అకౌంట్ లో రూ.1 వేసి లబ్దిదారుల ఖాతాలను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత రూ.15వేల చొప్పున జమ చేస్తారు.

ఏపీ రాజధానిగా తిరుపతిని చేయండి

అమ్మ ఒడి, నాడు–నేడు (Nadu-Nedu) కార్యక్రమం, మధ్యాహ్న భోజనం పథకంపై వైసీపీ (YCP)క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తొలి ఏడాదిలో ‘అమ్మ ఒడి’ (Amma Vodi)పథకానికి సంబంధించి 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనాథ పిల్లలకు సంబంధించి ‘అమ్మ ఒడి’ డబ్బును సగం అనాథాశ్రమానికి, మిగతా సగం పిల్లల పేరు మీద డిపాజిట్‌ చేయాలన్నారు.

రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ యోజన నిధులు

వైయస్‌.జగన్‌ సమీక్ష

కొన్ని కుటుంబాల్లో విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని క్షేత్ర స్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి, అర్హులైన వారికి తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం

వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో తప్పుల కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే పరిశీలించి అర్హులుగా గుర్తించాలని చెప్పారు. ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వివరించారు.

నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా

దీంతో పాటుగా స్కూల్స్ తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధనపైనా సీఎం సమీక్షించారు. స్వయం శిక్షణ యాప్స్‌ కూడా వెంటనే తయారు చేయాలని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంలో భాగంగా ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురించి అధికారులు సీఎంకు వివరించారు. స్వయం శిక్షణ కోసం వెంటనే యాప్స్‌ కూడా తయారు చేయించాలని సీఎం సూచించారు.

రూ. 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్

నాడు–నేడు

ప్రభుత్వం చేపడుతున్న నాడు–నేడు పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచి బాత్‌రూములు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన బెడ్లు, అల్మారాలు, చదువుకునేందుకు టేబుల్స్‌ ఉండాలని స్పష్టం చేశారు.

రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం

మొదటి దశలో 15,715 పాఠశాల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇవి జనవరి 15 నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. రెండు, మూడు దశల్లో స్కూళ్లు, హాస్టళ్లు, అన్ని జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు.

చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు

మరింత నాణ్యతతో మధ్యాహ్న భోజనం

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న పథకంలో నాణ్యత పెంచడం కోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామన్నారు.

వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు

దీంతో మొత్తంగా నాణ్యత పెంచేందుకు రూ.343.55 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.1,294 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, ఈనెలలో సంక్రాంతి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు నుంచి నాణ్యమైన మెనూ అమల్లోకి రానుంది.

కాపుల నేస్తంగా సీఎం జగన్ పథకం

మధ్యాహ్న భోజనం మెనూ ఇలా..

సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, చిక్కి

మంగళవారం : పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు

బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు

శుక్రవారం: అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగలి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement