Polavaram Suspense: పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్, 2021లోగా పోలవరం పూర్తి చేస్తామన్న కేంద్రం, దాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒడిషా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Polavaram Project(Photo-wikimedia commons)

Amaravathi, Febuary 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. వాస్తవానికి 2019నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. ఆ గడువును 2021 వరకు పెంచినట్లు కేంద్రం (Union Government) తెలిపింది.

పోలవరం (Polavaram) వివిధ భాగాల కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్టు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి (BJP MP Sujana Chowdary) పోలవరం ఎప్పటిలోగా పూర్తి అవుతుందని ప్రశ్న అడగ్గా.. కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం

ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ కోసం 3047 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1400 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టును అందిస్తేనే.. మళ్లీ నిధులు విడుదల చేస్తామని కేంద్రం రాజ్యసభలో (Rajya Sabha) తెలిపింది. పోలవరం పనులు తిరిగి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ర ప్రభుత్వం అడిట్ రిపోర్ట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గతంలో ఆర్థికశాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు కూడా గుర్తు చేసింది.

జగన్ సర్కార్ కొత్త రికార్డ్ , రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా

జగన్ సర్కార్ (AP CM YS Jagan) 2021నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. పోలవరం పనులు ఆగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి

రివర్స్ టెండరింగ్‌లో సుమారు 850 కోట్లు ఆదా చేశామని అనిల్ స్పష్టం చేశారు. కొన్ని పునరావాస సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. ఇటీవల అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టులోని రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-3కి శంకుస్థాపన చేశారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఒడిశా ప్రుభుత్వం కోర్టుకు (Supreme Court) వివరించింది. పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద ప్రవాహం ఏపీ చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఒడిశా వాదించింది.

పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు

ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేస్తూ 2018 జులై 10, 2019 జూన్‌ 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఒడిశా సర్కారు అత్యున్నత ధర్మాసనాన్ని కోరింది. ఏపీ సర్కారు ట్రైబ్యునల్‌కు సమాచారం ఇచ్చినట్టు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 36 లక్షలు క్యూసెక్కులు కాకుండా 50 లక్షల క్యూసెక్కుల వరకు ఉంటుందని ఒడిశా తెలిపింది.

పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు రద్దు

రూర్కీ ఐఐటీ సర్వే ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఒడిశా సర్కారు చెప్పింది. అదే జరిగితే ఒడిశా పరిధిలోని శబరి, సీలేరు ప్రాంతాల్లో 200 అడుగులకుపైగా ముంపు తలెత్తుతుందని, అంత వరద ప్రవాహాన్ని.. పోలవరం డ్యాం తట్టుకోలేదని చెప్పింది.

టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన కార్యదర్శి

పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 2005లో 412గా పేర్కొనగా.. 2017 మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి తగ్గింది. ముంపు గ్రామాలపై స్పష్టత లేదని ఒడిశా ఆరోపించింది. తమకు జరిగే నష్ట నివారణకు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయాలని కోరింది. పూడిక వల్ల భవిష్యత్తుల్లో బ్యాక్ వాటర్‌తో నష్టం మరింత పెరుగుతుందని ఆరోపించింది.

పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు రద్దు తీర్మానం 

గరిష్ట వరదను లెక్కించడానికి బ్యాక్‌వాటర్‌ స్టడీ చేయించాలని కోరింది. పోలవరం కారణంగా తమ రాష్ట్రంలో 6 వేల మంది గిరిజనులపై ప్రభావం ఉంటుందని.. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఒడిశా ఎంపీ సస్మత్ పాత్రా శుక్రవారం రాజ్యసభలో కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now