రాజకీయాలు

GHMC Elections 2020: మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను (GHMC Elections 2020) దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

Nitish Takes Oath as Bihar CM: ఏడవసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, ఉపముఖ్యమంత్రులుగా తార్‌కిషోర్ ప్రసాద్, రేణూ దేవీ, 12 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్

Hazarath Reddy

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌​ ప్రమాణ స్వీకారం (Nitish Kumar Takes Oath as Bihar Chief Minister) చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకోగా.. ఏడవ సారి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. సోమవారం ఏర్పాటు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్‌ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

Bihar Government Formation: స్పీకర్ పోస్ట్ మాదే అంటున్న బీజేపీ, బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం నేడే, డిప్యూటీ సీఎంగా ఇద్దరని నియమించే యోచనలో అధిష్టానం

Hazarath Reddy

బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం (Bihar Government Formation) చేయనున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. మొత్తంగా ఏడవసారి నితీష్ కుమార్ (Nitish Kumar) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు క్యాబినెట్లోకి ఎవరిని తీసుకుంటారు, డిప్యూటీ సీఎంగా ఎవరు ఉంటారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Nitish Kumar as Next CM of Bihar: బీహార్ సీఎంగా రేపే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, ఏడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ అధినేత, డిప్యూటీ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ మరోసారి (Nitish Kumar as Next CM of Bihar) చేపట్టబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు.

Advertisement

MLC Posts in TS: తెలంగాణలో కొత్తగా ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేసిన మంత్రివర్గం

Hazarath Reddy

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను (Telangana Legislative Council) భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం (TS Cabinet) నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

Bihar Assembly Election Results 2020: బీహార్‌లో బీజేపీ విజయఢంకా, అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ, 125 సీట్లతో అధికారాన్ని ఏర్పాటు చేయనున్న ఎన్డీయే కూటమి

Hazarath Reddy

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో (Bihar Assembly Election Results 2020) చివరకు అధికార ఎన్డీయే (NDA) విజయకేతనం ఎగుర వేసింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ (RJD) నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది.

KTR on Dubbaka Bypoll Result: ఓటమంటే భయం లేదు, ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకుంటాం, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ రెండవ ప్లేసుకే పరిమితమైంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత మంత్రి కేటీఆర్ (KTR on Dubbaka Bypoll Results) మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.

Dubbaka By-Election Result 2020: ఉద్యమగడ్డపై బీజేపీ విజయకేతనం, కారు జోరుకు బ్రేకులు వేసిన కాషాయం పార్టీ, కనిపించని కాంగ్రెస్ ప్రభావం, 1470 ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు

Hazarath Reddy

ఉద్యమ గడ్డపై కాషాయం రెపరెపలాడింది. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పై స్వల్ప మెజార్టీతో గెలిచింది. కాగా దుబ్బాక ఉపఎన్నికల ఫలితం రెండు పార్టీల మధ్యనే దోబూచులాడింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క రౌండ్ లో ఆధిక్యం కనపరిచిందే తప్ప మరెక్కడా పోటీలో లేదు.

Advertisement

Bihar Polls: బీహార్‌లో బీజేపీ దూకుడు, అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం, ఎన్డీయే కూటమికి బీహారీలు పట్టం కట్టబోతున్నారా ? 129 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం, మహాఘట్ బంధన్ 99 స్థానాల్లో ఆధిక్యం

Hazarath Reddy

బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ శర వేగంగా మారుతోంది. తొలి రౌండ్లలో ఆర్జేడీ పలుచోట్ల ఆధిక్యం కనబరిచినప్పటికీ క్రమంగా బీజేపీ ఆధిక్యం (Bihar Assembly Elections 2020 Results) పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, బీహార్‌లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా (single-largest party) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dubbaka By-Election Result 2020: దుబ్బాకలో తగ్గుతున్న కారు స్పీడు, వరుసగా నాలుగు రౌండ్లలో బీజేపీ దూకుడు, కనిపించని కాంగ్రెస్ పార్టీ ప్రభావం

Hazarath Reddy

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో (Dubbaka By-Election Result 2020) టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇచ్చేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు (M Raghunandan Rao) 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉండడం గమనార్హం. దుబ్బాకలో ఇప్పటి వరకు 28,074 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బీజేపీ 13,055, టీఆర్ఎస్‌ 10,371, కాంగ్రెస్‌ 2,158 ఓట్లతో ఉన్నాయి. అంతకుముందు మూడో రౌండ్‌లోనూ బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించింది.

Madhya Pradesh Bypoll Results 2020: సింధియాకు సవాల్‌గా మారిన ఉప ఎన్నికలు, బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందా? కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఎంపీ ఫలితాలు మరి కొద్ది గంటల్లో..

Hazarath Reddy

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు (Madhya Pradesh Bypoll Results 2020) మరో కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ రాష్ర్టంలో అధికారాన్ని డిసైడ్ చేయ‌నున్నాయి.

Bihar Assembly Election Results 2020: తేజస్వీ యాదవ్ వైపే చూపంతా.., నితీష్‌కుమార్‌పై ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాఘట్‌బంధన్‌ వైపే, బీహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో (Bihar Assembly Election 2020) పాటు, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Assembly Elections Results 2020) ప్రారంభం అయింది. బీహార్ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీయే, తేజస్వి యాదవ్ (RJD Tejashwi Yadav) సారథ్యంలోని ఐదు పార్టీల కూటమి మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) మధ్య జరిగాయి. కాగా, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాఘట్‌బంధన్‌కే అనుకూలమని చెబుతున్నాయి.

Advertisement

Joe Biden Elected 46th US President: వైట్‌హౌస్‌ నుంచి ట్రంప్ ఔట్, అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌, బైడెన్ జీవిత చరిత్రను ఓ సారి తిరగేస్తే..

Hazarath Reddy

అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election 2020) డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌నే (77) (Joe Biden) చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా (Joe Biden Elected 46th US President) శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డుసృష్టించనున్నారు.

US Election Results 2020: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా జో బిడెన్, మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో డెమొక్రాటిక్ అభ్యర్థి, కొనసాగుతున్న కౌంటింగ్, ఎన్నికల ప్రక్రియ అంతా ఫ్రాడ్ అని కోర్టును ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్ బృందం

Team Latestly

అమెరికాలో మొత్తం ఉన్న 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు కనీసం 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో 214 ఓట్లతో ఉండటాన్ని బట్టి చూస్తే ఇక ఆయన వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిందేనని తేలిపోయింది....

US Elections 2020: వివాదాల మధ్య జూనియర్ ట్రంప్ ట్వీటు, మ్యాప్‌లో జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ఇండియా నుంచి అవుట్, మండి పడుతున్న విపక్షాలు, ట్వీటుపై స్పందించిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపట్లో (US Elections 2020) వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. జూనియర్ ట్రంప్ ట్వీటుపై (Donald Trump Jr Tweet) మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్‌ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Bihar Polls: సీఎం నితీష్ ఫెయిల్యూర్‌ అంటూ నినాదాలు, బీహార్ సీఎం‌ పైకి ఉల్లిపాయలు, రాళ్లు విసిరిన యువకులు, మధుబనిలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ఘటన

Hazarath Reddy

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు (Bihar Chief Minister Nitish Kumar) చేదు అనుభవం ఎదురైంది. ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. మధుబనిలోని హర్లాఖిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో (Harlakhi Election 2020) మాట్లాడుతుండగా నితీష్‌పైకి ఉల్లిపాయలు విసిరారు.

Advertisement

Bihar Assembly Elections 2020: బీహార్‌లో కొనసాగుతున్న పోలింగ్, నితీష్ కుమార్ సీఎం కాలేరంటూ చిరాగ్ పాశ్వాన్ జోస్యం, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

బీహార్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 243 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు (Bihar Assembly Elections 2020) జరుగుతున్నాయి. 94 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ (bihar-assembly-election-polling) ప్రశాంతంగా సాగుతోంది. 17 జిల్లాలోని 94 నియోజకవర్గాలకు సుమారు 1463 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా మహారాజ్‌గంజ్‌ స్థానానికి 27 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అత్యల్పంగా దారౌలిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Madhya Pradesh Bypolls: మధ్యప్రదేశ్ సర్కారు ఉంటుందా..ఊడుతుందా? సింధియా టీం మళ్లీ విజయం సాధిస్తుందా? ఎంపీలో 28 స్థానాలకు మొదలైన పోలింగ్, గెలుస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల నడుమ మరోసారి హోరా హోరీ పోరు మొదలైంది. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Bypolls) 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు (Madhya Pradesh By-Elections 2020) జాతీయ స్థాయిలో తెగ ఆసక్తిగా మారాయి. కమల్‌నాథ్‌ సర్కార్‌ను (Kamal nath Govt) కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్‌ ఇదివరకే మొదలైంది.

Dubbaka By-poll 2020: దుబ్బాక ఉపఎన్నికకు ప్రారంభమైన పోలింగ్, కరోనా నిబంధనలు అమలు, మాస్క్ ఉంటేనే అనుమతి, సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్

Team Latestly

ఉపఎన్నికకు ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి అభ్యర్థికి సన్నిహితుల దగ్గర్నించి భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అలా రెండు సార్లు పట్టుబడటంతో తెరాస- బీజేపీ- కాంగ్రెస్ నేతల మాటల తూటాలు, సంచలన ప్రకటనలు, సవాళ్లతో చలికాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయ వేడిపుట్టించింది. నవంబర్ 10న దుబ్బాక ఫలితం తేలనుంది.....

Munger Firing Incident: ముంగేరి కాల్పుల ఘటన, హిందూత్వంపై దాడిగా వర్ణించిన శివసేన, ఎస్పీ లిపి సింగ్‌‌ను విధుల నుంచి తొలగించాలని ఎస్ఈసీ ఆదేశాలు, నితీష్ కుమార్ ఆదేశాలతోనే జరిగిందని తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాలో దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా పోలీసులు, ఉత్స‌వాల్లో పాల్గొన్న‌వారికి మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు, కాల్పులు (Munger Firing Incident) సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ కాల్పుల ఘటనను హిందూత్వ‌పై దాడిగా (attack on Hindutva) శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లు ఎన్‌డీఏ పాలిత రాష్ట్ర‌మైన బీహార్‌లో చోటుచేసుకున్నాయి కాబట్టి అక్క‌డి గ‌వ‌ర్న‌ర్‌గానీ, బీజేపీ నేత‌లుగానీ నోరు మెద‌ప‌డం లేద‌ని రౌత్ (Shiv Sena MP Sanjay Rout) విమ‌ర్శించారు.

Advertisement
Advertisement