AP Capital Political Row: తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటున్న అమరావతి రైతులు, ఆడపడుచులు రోడ్డెక్కారంటున్న చంద్రబాబు, కొనసాగుతున్న రైతుల ధర్నాలు, ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని అంశం
ఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.
Amaravathi, December 23: ఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.
సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి (Amaravathi)పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. అక్కడ రైతులు ధర్నాకు దిగారు, నిరసన దీక్షలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో నాయకులు ఎవరికి వారే ఏదో జరిగిపోతుందని ఊహించుకుని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నాయకులు మాత్రం రాజధాని అంశం మీద స్టేట్ మెంట్ మీద స్టేట్ మెంట్లు ఇస్తూ పోతున్నారు. వారి స్టేట్ మెంట్లను ఓ సారి పరిశీలిస్తే..
టీడీపీ నేత చంద్రబాబు:
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారు ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి వారికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఏనాడూ గడపదాటి బయటికి రాని ఆడపడుచులు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక పనిచేసుసుకునే రైతన్నలు, రైతుకూలీలు అందరూ ఆందోళన బాటపట్టారని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతులు తమ భూములు ఇవ్వడం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుందని ఆశించానని, ఇదొక మహానగరం అవుతుందని భావించానని తెలిపారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన 29 గ్రామాల రైతులందరూ న్యాయం చేయమని అడుగుతున్నారని, వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించారు.
ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ రైతులు బాధతో రోడ్డెక్కడం పట్ల బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఆ రోజు తానిచ్చిన హామీ వ్యక్తిగతంగా ఇవ్వలేదని, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఇచ్చానని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తమకు సంబంధంలేదని ప్రభుత్వం అంటే అది చట్టవిరుద్ధం అవుతుందని, రాజ్యాంగ వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు.
తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి
సీపీఐ నారాయణ
చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు తోనే సాధ్యమని అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని, అయితే, అసెంబ్లీ, సచివాలయం వేరే చోట్ల లేవని చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు
జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించారని, రాజధానిని మూడు ముక్కలు చేయాలనుకోవడం కరెక్టు కాదని టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. గతంలో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండేందుకు అంగీకరించిన జగన్, ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. అసలు, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.
మాజీ ఎంపీ చింతా మోహన్ కొత్త పల్లవి
ఏపీ రాజధాని విషయంలో మాజీ ఎంపీ చింతా మోహన్ కొత్త పల్లవి అందుకున్నారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు మారిన రాజధాని, ఐదోసారి మారడం తథ్యమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందని, జగన్, చంద్రబాబు ఇద్దరూ అమిత్ షా గుప్పిట్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, తిరుపతి నగరమే ఏపీకి సరైన రాజధాని అని, 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలనుకున్నారని చింతా మోహన్ వెల్లడించారు.
కొనసాగుతున్న అమరావతి రైతులు ఆందోళన
రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కొత్త ప్రచారం ఎత్తుకోవడంతో అమరావతి రైతులు గత కొన్నిరోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ రైతులు పోలీసులను ఆశ్రయించారు. రాజధానిపై తీవ్ర అనిశ్చితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు.
నేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
మాజీ మంత్రి అఖిలప్రియ
రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్ధరించామని చెప్పవద్దని కోరిన ఆమె, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సలహా ఇచ్చారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుతోందని అఖిలప్రియ విమర్శలు గుప్పించారు.
మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)